వాహ్…… అద్భుతం….. రాజకీయ వ్యూహాలు, కుట్రల విషయంలో మాత్రం చంద్రబాబును మించిన నాయకుడు ప్రస్తుతం దేశంలోనే లేడని చెప్పొచ్చేమో. అందుకే ఎన్టీఆర్‌లాంటి ధీశాలి కూడా చంద్రబాబు కుట్రలకు బలైపోయి దిక్కూమొక్కూ లేని స్థితిలో దీనంగా తనువు చాలించాడు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిలువునా ముంచాడు. కిరణ్ కుమార్ రెడ్డి తన ఆగర్భ శతృవు అన్న స్థాయిలో మాట్లాడుతూ తెరవెనుక మంతనాలు చేసి మొత్తానికే మోసం చేశారు. సీమాంధ్ర ప్రయోజనాల కోసం ఏదో చేస్తున్నామన్న కలర్ ఇచ్చి నిండా ముంచారు.
2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా బాబువి అవే డ్రామాలు. హోదా సంజీవని, పదిహేనేళ్ళు కావాలి అని ఆయనే చెప్తాడు. ఓటుకు కోట్లుతో సహా అన అక్రమాలు, అవినీతి, స్వార్థప్రయోజనాల కోసం అదే హోదాను తాకట్టుపెట్టేసి హోదా వేస్ట్ అని అదే నోటితో ఆయనే అంటాడు. అందరూ ఆ మాటే చెప్పాలని….అలా చెప్పకపోతే వారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిరోధకులు అని ముద్ర వేస్తానంటాడు.
ఇక ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా బాబు నడిపిస్తున్న డ్రామా కూడా కుట్రలకు పరాకాష్ట అన్నట్టుగా ఉంది. ఎన్ని సార్లు నినాదాలు చేశారు, ఎంతసేపు నిలబడ్డారు అనే విషయం పక్కనపెడితే టిడిపి నడిపిన మొత్తం కుట్ర రాజకీయం ఏంటంటే…….. బడ్జెట్ విషయంలో మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయకుండా కాంగ్రెస్ వాళ్ళ ప్రసంగాలన్నింటినీ అడ్డుకున్నారు. అధికారంలో లేని కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఇక యథాలాపంగా సభలో కూడా లేని వైఎస్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సరిగ్గా నరేంద్రమోడీ మాట్లాడే టైంకి మాత్రం అందరూ సైలెంట్ అయ్యారు. మరోవైపు రాజ్యసభలో టిడిపి ఎంపి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ బడ్జెట్‌ని వేనోళ్ళ పొగిడేశాడు. వైకాపా ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డిలు బడ్జెట్‌లో జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదాపై ప్రసంగించారు. కానీ టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ మాత్రం ……‘టిడిపిని వదిలి వైఎస్ జగన్‌తో పొత్తు పెట్టుకుంటారా’ అంటూ బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా రాజకీయ అంశాలు లేవనెత్తారు. షరామామూలుగానే వైఎస్ జగన్ అవినీతిపరుడంటూ రాజకీయ బురదజల్లడానికే ప్రాధాన్యతనిచ్చాడు. అది కూడా మోడీ ప్రసంగానికి నిరసన తెలుపుతూ వైసీపీ వాకౌట్ చేసిన టైంలో జగన్ అవినీతి అంటూ బడ్జెట్‌ని వదిలేసి రాజకీయ ప్రసంగాలు చేశారు టిడిపి ఎంపిలు.
ఇక పచ్చ మీడియా కథలు కూడా టిడిపి కుట్రలకు ఏ మాత్రం తక్కువగా లేవు. బడ్జెట్‌పై మోడీ ప్రసంగానికి నిరసనగా వాకౌట్ చేసిన వైకాపా ఎంపీలది తప్పట. సభలో కూర్చుని మోడీ ప్రసంగానికి సహకరించిన టిడిపి ఎంపీలది పోరాటమట. వారెవ్వా……..ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫూల్స్ అని అనుకుంటున్నారో……. అమాయకులని అనుకుంటున్నారో కానీ చంద్రబాబు డైరెక్షన్‌లో పచ్చ బ్యాచ్ అందరూ నడిపిస్తున్న డ్రామా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్న మేధావులకు, ఢిల్లీలో ఉన్న సీనియర్ జర్నలిస్టులకు మాత్రం చిరాకు తెప్పిస్తోంది. పార్లమెంట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడాల్సిన సందర్భంలో జగన్ అవినీతి అంటూ లేకి రాజకీయం చేయడం మాత్రం టిడిపికే చెల్లిందని చెప్పొచ్చు.
