Friday, May 3, 2024
- Advertisement -

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి 135 సీట్లంట‌…..?

- Advertisement -

2019 ఎన్నిక‌లు ఏపీలో మ‌హాసంగ్రామాన్ని త‌ల‌పించ‌నున్నాయి. ఈ సారి వైసీపీ అధికారంలోకి రావాల‌ని….మ‌రో సారి అధికారం చేప‌ట్టి మ‌రో సారి త‌న స‌త్తా చాటాల‌ని టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే ఇప్ప‌టి నుంచే అన్ని పార్టీలు సొంత‌గా ఎన్ని సీట్లు వ‌చ్చేది స‌ర్వేలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రో వైపు జ‌న‌సేన‌కూడా ఈసారి ఒంట‌రిగా ఎన్నిల‌కు దిగుతామ‌ని ప్ర‌క‌టించారు.

తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో 135 సీట్లలో గెలుస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. కేవ‌లం 40 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ పోటీ ఇచ్చే ప‌రిస్థితులు ఉంటాయ‌ని సెల‌విచ్చారు. బాబు చెబుతున్న లెక్క‌లు నిజ‌మేనా…?మ‌రో వైపేమో వైసిపి అధినేత వచ్చే ఎన్నికల్లో 130 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేది తామే అని ఢంకా భజాయించి మరీ చెబుతోంది. అస‌లు ఏది నిజం అన్న ప్ర‌శ్న ఇప్పుడు ప్ర‌జ‌ల‌, మేధావుల్లో త‌లెత్తుతోంది.

జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఒకవైపు పాదయాత్రకు హాజరవుతున్న జనాలు, ఇంకోవైపు చంద్రబాబు చెబుతున్న మాటలు.. రెండింటిలో ఏది నిజం? ఇపుడీ అనుమానమే అందరి బుర్రనూ తొలిచేస్తోంది.

అధికారం మాదంటే మాదే అని వైసీపీ, టీడీపీ పార్టీలు చంక‌లు గుద్దుకుంటుంటే…మ‌రి జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి ఏంకావాలి. అయితే బాబు స‌రైన క్లారిటీ ఇవ్వ‌లేదు. టీడీపీ ఒంట‌రిగానె గెలుస్తాదా లేకా జ‌న‌సేన‌, భాజాపాతో క‌ల‌సి అన్ని సీట్లు సాధిస్తారా అన్నది క్లారిటీలేదు. ఇందులో ఏది నిజ‌మో…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -