Sunday, May 12, 2024
- Advertisement -

పార్టీ మార‌డంలోనె కిక్కు ఉంద‌ప్పా…

- Advertisement -

ఇంట్లో కూర క‌న్నా పొరిగింటికూరె రుచి అనే సామెత‌ను సాధారంగా అంద‌రు వినే ఉంటారు. ఇప్పుడు అలాంటి స‌మెతె ఇప్పుడు టీడీపీకి స‌రిపోతుంది. రెండు రాష్ట్రాల్లో ఫిరాయింపుల జాత‌ర కొన‌సాగుతోంది. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా మారూటె స‌ప‌రేటు అంటూ వెల్తున్నారు. ఇక ప్ర‌తిప‌క్షంలో ఉన్న నేత‌లు ఎప్పుడెప్పుడాఅని అధికార‌పార్టీలోకి వెళ్ల‌డానికి తెగ ఉత్సాహం చూపుతున్నారు. ప్రజలకు మేలు చేస్తామని వారి చేత ఓట్లు వేయించుకున్న శాసనసభ్యులు ఓట్లేసిన తరువాత ప్రజలను గాలికి ఒదిలేసి వారి దారి వాళ్ళు చూసుకుంటున్నారు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారంలో నాయకులు చెప్పే నీతి మాట‌లు అబ్బో భ‌లేగుంటాయి. నేతిబీర‌కాయ‌లో నెయ్యిఎలా ఉండ‌దో వీరు చెప్పే మాట‌ల్లో నీతి కూడా అలాగెఉండ‌దు. అవ‌స‌రం అనుకుంటె చిన్న‌పిల్ల ముడ్లు క‌డ‌గ‌డాన‌కి కూడా వెనుకాడ‌రు. నన్ను గెలిపిస్తె మీస‌మ‌స్య‌ల‌ను తీరుస్తాన‌ని తియ్య‌టి మాట‌లు చెప్ప‌డం స‌హ‌జ‌మే. కాని తీరా గెలిచాక మాత్రం అధికారంలో ఉండె పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఒక పార్టీ త‌రుపున గెలిచి కాట్రాక్ట‌ర్ల పేరుతో దోచుకుంటూ వారి జేబులు నింపుకొంటు ఓట్లు వేసిన ప్ర‌జ‌ల‌ను గాలికొదిలేస్తున్నారు. మీకేం కావాలో చెప్పండి అంటూ అధికార‌పార్టీ నిస్సిగ్గుగా ఆఫ‌ర్లు ఇస్తోంది.

ఇదంతా బాగ‌నె ఉందికాని అధికార పార్టీకి చిక్కంతా ఇక్క‌డే. అధికార‌పార్టీనుంచి గెలిచిన నేత‌ల‌కు గాలికి వ‌దిలేసి…ఫిరాయింపు నేత‌ల‌కు రెడ్ కార్పెట్ ప‌ర‌చ‌డంతో సొంత‌పార్టీ నేత‌లు లోలోప‌న కుమిలిపోతున్నారు. మొద‌టి నుంచి పార్టీకోసం ప‌నిచేసిన వాల్ల‌ను కాకుండా ఫిరాయింపుల‌కు పెద్ద పీట వేయ‌డంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికార పార్టీలో ఉన్న వారు ఎలాగూ ప్రతిపక్షానికి వెళ్ళలేరు కాబట్టి… వారికి ఎలాంటి తాయిలాలు ప్రకటించాల్సిన పని లేదు, కానీ పక్క పార్టీ నుంచి అధికార పార్టీలో చేరితేనే కదా నాయకుడికి అసలైన కిక్కు.

రాను రాను పిరాయింపు రాజ‌కీయాలు ఎతంకు దిగ‌జారాయంటె….ముందు ఏదొక పార్టీలో గెలిచి త‌ర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి వెల్లి కాంట్రాక్టులు, మంత్రుప‌ద‌వులు పొంద‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు నాయ‌కులు. అందుకె అంటారు ఇంట్లో ప‌ప్పుక‌న్నా పొరిగింటి ప‌ప్పే రుచి ఎక్కువంటారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వ‌చ్చే కిక్కుకంటె …అదికార‌పార్టీలో వ‌చ్చే కిక్కే వేర‌ప్పా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -