ఎపి లో ఎవరు సుఖంగా లేరా..!!

- Advertisement -

జగన్ పరిపాలన ఎపిలో మూడు పధకాలు ఆరు అప్పులు అన్నట్టుగా కొనసాగుతోంది.. ఖజానా ఖాళీ అయిన ఈ టైమ్ లోనే ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ అంటూ పట్టుపట్టారు.. మరోపక్క ఎయిడెడ్ స్కూళ్ల ప్రైవేటీకరణ పై విద్యార్థులు రొడ్డెక్కారు.. ఇక సీరియల్ మాదిరి అమరావతి రైతుల పోరాటం జగన్ ప్రభుత్వం పై తొలి నుంచి కొనసాగుతూనే ఉంది. పెరిగిన ధరలతో సామాన్యులు కడుపు నిండా తినటానికే కష్టంగా ఉంది.

అలాగనీ వైసిపీ వారు సుఖంగా ఉన్నారా అంటే , ప్రతినెల సంక్షేమం అందుకునే వారి సంఖ్య తగ్గిపొతుందంటూ , సొంత పార్టీ కార్యకర్తలే గొల చేస్తున్నారు. చివరికి మంత్రులు కూడా తమ శాఖలకు సంబంధించిన అంతిమ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కూడా తమకు లేకుండా పోతోందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. సరే జగన్ ఎవన్నా సుఖంగా ఉన్నారా అంటే .. ప్రతినెల అప్పు దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది‌ .

- Advertisement -

ఇన్ని తలనొప్పుల మధ్య ప్రతి ఎన్నికల్లో వైసిపి విజయాలను అందుకుంటూ ఉండటమే , జగన్ కు కాస్త ఉపశమనం గా ఉంది. అయితే దీనిపై కూడా ప్రతిపక్షాలు రకరకాల ఆరోపణలు , కేసులు వెస్తున్నప్పటికీ , జగన్ తన చరిష్మాతో వాటన్నింటినీ తట్టుకుని నిలబడగలుగుతున్నారు.. సో ఓ విధంగా సిఎం నుంచి కామన్ మ్యాన్ వరకు ఎపిలో ఎవరి పరిస్థితైనా ఇప్పుడు అనునిత్యం ఓ పోరాటం లా కొనసాగుతోంది.

క్రిప్టో మాయ‌లో ప‌డి యువ‌త ఏం చేస్తున్నారో తెలుసా

ఆ ఇద్దరు మినిష్టర్ లపై ట్రోలింగ్..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -