Friday, May 17, 2024
- Advertisement -

మోడీ అంటే బాబుకు అంత భయమా? సొంత పార్టీ నేతలనే తిట్టిపోశాడుగా?

- Advertisement -

మాటలు కోటలు దాటి ఇంకా ఎత్తులకు వెళ్తున్నాయి…..చేతల్లో మాత్రం అసలు భయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మోడీ కోసం సొంత పార్టీ నేతలపైనే ఆగ్రహం, ఆవేశం ప్రదర్శించేంత స్థాయిలో మోడీ దగ్గర సాగిలపడుతున్నాడు చంద్రబాబు. హోదా, రాజధాని నిధులు, జోన్, పోలవరం ……ఇలా ఆంధ్రప్రదేశ్‌కి హక్కుగా రావాల్సిన వాటిని కూడా మోడీ ఇవ్వడం లేదన్నది నిజం. అయితే మోడీ ఏమీ చేయకపోయినప్పటికీ మోడీని ఎవ్వరూ పల్లెత్తు మాట అనడానికి వీళ్ళేదని తన అధికార బలం, మీడియా బలం మొత్తాన్ని ఉపయోగించి మోడీకి చంద్రబాబు వంత పాడుతున్నాడన్నది కూడా అంతే నిజం. మోడీ నుంచి రాష్ట్రానికి ఒక్క ప్రయోజనం కూడా రావడం లేదని చంద్రబాబే చాలా సార్లు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటాడు కాబట్టి….రాష్ట్ర ప్రయోజనాల కోసమే మోడీ దగ్గర సాగిలపడుతున్నాడని అస్సలు చెప్పలేం. ఎందుకంటే మూడున్నరేళ్ళుగా అలాంటి ప్రయోజనాలు ఏవీ రాష్ట్రానికి రావడం లేదు కాబట్టి. ఇక తెరవెనుక చంద్రబాబు పొందుతున్న వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి? తనను తాను కాపాడుకోవడానికి సీమాంధ్రులకు విభజన నాటి నష్టం కంటే ఇంకా ఎక్కువ నష్టం ఏ విధంగా చేస్తున్నాడు అన్న విషయాలు అందరికీ తెలిసినవే.

ఇక మోడీ అంటే చంద్రబాబు ఏ స్థాయిలో భయపడుతున్నాడో తాజాగా ఇప్పుడు మరో సంఘటనతో తెలిసింది. గుజరాత్‌లో గెలిచిని విధానం ఎలాంటిదైతేనేం? అసలు ఆ గెలుపు కూడా ఒక గెలుపేనా అని విశ్లేషకులు ఎటకారం చేస్తుంటేనేం …….బిజెపి నాయకులు మాత్రం ఆ గెలుపు కిక్కును పూర్తిగా తలకు ఎక్కించుకున్నారు. ఆ ఆవేశంలోనే 2019లో ఆంధ్రప్రదేశ్2లో కూడా అధికారంలోకి వస్తాం అని చెప్పి ప్రకటనలు గుప్పించారు. దాంతో టిడిపి నేతలకు కోపం వచ్చింది. 2019లో కూడా టిడిపినే అధికారంలోకి వస్తుంది, బాబే సిఎం అవుతాడని మేం చెప్తుంటే బిజెపి అధికారంలోకి వస్తుందని ఎలా చెప్తారు? పగటి కలలు కంటున్నారా? మిత్రద్రోహం చేస్తారా? టిడిపి సపోర్ట్ లేకపోతే అధికారం సంగతి తర్వాత కనీసం ఓట్లన్నా తెచ్చుకోగలరా అంటూ టిడిపి నేత బాబూ రాజేంద్రప్రసాద్ రెచ్చిపోయి మరీ బిజెపికి కౌంటర్ ఇచ్చాడు ఆ దెబ్బతో బిజెపి వాళ్ళు బెదిరిపోతారని…..చంద్రబాబు తనను దగ్గరకు పిలిచి అభినందిస్తాడని బాబూ రాజేంద్రప్రసాద్ అనుకుంటే …….ఆయన కూడా ఊహించని విధంగా బాబు బెదిరిపోయాడు. వెంటనే బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడిన తన పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బిజెపికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఏమీ మాట్లాడొద్దు…..ఏం మాట్లాడినా ఊరుకోను అంటూ టిడిపి నేతలకు తలంటుపోశారు బాబు. ఆ దెబ్బతో మోడీకి చంద్రబాబు ఎంతలా భయపడుతున్నాడో టిడిపి నేతలకు కూడా తెలిసొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -