Thursday, May 9, 2024
- Advertisement -

30 నుండి కార్యాచరణ షురూ!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. ఇక నవంబర్ 29(రేపటి)తో చంద్రబాబుపై కోర్టు విధించిన ఆంక్షలు ముగుస్తుండటంతో ఆయన కార్యాచరణ ఎలా ఉండనుంది అన్నదానిపై టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు.

చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత టీడీపీ పరిస్థితి ఏంటి అనేదానిపై అందరికి క్లారిటీ వచ్చేసింది. బాబు లేకుంటే టీడీపీ లేదని అర్ధమై పోయింది. అందుకే ఏం చేస్తే టీడీపీని కాపాడుకోగలం అన్న దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇక యువగళం పేరుతో నారా లోకేష్ ప్రజల్లో ఉన్నా వస్తున్న స్పందన అంతంత మాత్రమే. అందుకే తాను ఇకపై తాను తెరవెనుక ఉండి ఏదిఏమైనా లోకేష్‌తోనే టీడీపీ భవిష్యత్ అని చెప్పాలని ఉవ్విళ్లూరుతున్నారు బాబు. మరి కోర్టు ఆంక్షలు ముగిసిన తర్వాత బాబు తీసుకోబోయే స్టెప్ ఏంటి అనేదానిపై టీడీపీ శ్రేణులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా ఇదే వారంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది. క్వాష్ పిటిషన్ చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఓకే లేదంటే ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే స్కిల్ స్కాం కేసులో 13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలు ఉన్నాయి. ఈ స్కాం ద్వారా 241 కోట్లు షెల్ కంపెనీల పేరుతో దారి మళ్లాయని ప్రధాన ఆరోపణ. సెప్టెంబర్ 9న చంద్రబాబును అరెస్ట్ చేయగా 10న రాజమండ్రి జైలుకు తరలించారు. ఇక ఐదు పర్యాయాలు చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ పొడగించగా 52 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అనారోగ్య కారణాలతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు కాగా నవంబర్ 20న న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -