Monday, April 29, 2024
- Advertisement -

చిన‌బాబు దెబ్బ‌కు గంటా ఫోన్ స్వీచాఫ్‌..

- Advertisement -

మంత్రి గంటా శ్రీ‌నివాస్ ఫోన్ స్వీచ్ఛాప్ చేసుకున్నారు.. చంద్ర‌బాబుతో స‌మావేశమైన గంటా మ‌ధ్య‌లోనే వెళ్లిపోయారు.. మ‌ళ్లీ క‌ల‌వాల‌ని చంద్ర‌బాబు ఆదేశించినా గంటా ప‌ట్టించుకోలేదు. ప్ర‌స్తుతం ఈ వార్త‌లు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో స‌ర్క్యూలేట్ అవుతున్న వార్త‌లు.

ఈ వార్త‌ల‌ను కొంచెం త‌రిచి చూస్తే మంత్రి గంటా శ్రీనివాస్‌ సీటుకు ఎసరొచ్చింద‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యంత సురక్షితమైన స్థానం నుంచి తన కుమారుడు నారా లోకేష్‌ను బరిలో దింపాలని భావిస్తున్న చంద్రబాబు… గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి సీటుపై కన్నేశార‌ని స‌మాచారం. పైకి లోకేష్ పోటీ చేస్తానంటే భీమిలి సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని గంటా చెబుతూ వచ్చారు క‌దా మ‌రి ఇంకేం స‌మ‌స్య అనుకోకండి అది కేవ‌లం బ‌య‌టికి చేసిన వ్యాఖ్య‌లే. కానీ లోపల భీమిలి నుంచి తానే పోటీ చేస్తానని పార్టీ పెద్దలకు చెబుతూ వచ్చార‌ట గంటా.

చంద్రబాబునాయుడు శుక్రవారం గంటాను పిలిపించుకుని భీమిలి సీటు నారా లోకేష్‌కు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మీరు కావాలంటే విశాఖ ఎంపీ లేదా విశాఖ నార్త్ , గాజువాక, చోడవరం నుంచి పోటీ చేయండి అని సూచించారు. ఇలా తన సీటుకు ఎసరుపెట్టడంతో గంటా నొచ్చుకున్నారు. సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. మరోసారి రావాల్సిందిగా గంటాకు చంద్రబాబు సూచించారు. కానీ శనివారం సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరుకాలేదు. ఫోన్ స్విచ్‌ ఆఫ్ చేసుకున్నారు. ముఖ్యులు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. మ‌రి ఈ సారి గంటాను అల‌క పాన్పు నుంచి దింప‌డానికి ఏం చేస్తారో చూడాలి టీడీపీ పెద్ద‌లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -