Sunday, May 5, 2024
- Advertisement -

2019లో ఆళ్ళగడ్డలో పోటీ నేనే, గెలుపు నాదే అన్న ఎవి….అఖిల ఆగ్రహం

- Advertisement -

అమరావతి వేదికగా చంద్రబాబు చూపించిన సినిమా అట్టర్‌ఫ్లాప్ అయింది. భూమా అఖిల ప్రియ, ఎవి సుబ్బారెడ్డిలను తన దగ్గరకు పిలిపించుకుని గంటలు గంటలు ఇద్దరితో మాట్లాడడం………బాబుతో మాట్లాడిన వెంటనే వాళ్ళిద్దరూ కూడా మీడియా ముందుకు వచ్చి …….‘పార్టీ కోసం కష్టపడతాం…..పార్టీ గెలుపే ముఖ్యం’ అంటూ పలికిన రొటీన్ పలుకులన్నీ ఉత్త డ్రామానే అని ఇప్పుడు స్పష్టంగా జనాలకు అర్థమైపోయింది. చంద్రబాబు పంచాయితీ సమయంలోనే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటేనే పార్టీలో ఉంటానని తేల్చిచెప్పాడు ఎవి సుబ్బారెడ్డి. అయితే చంద్రబాబు మాత్రం షరా మామూలుగానే తనదైన స్టైల్‌లో సీటు విషయంపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా ఎవి సుబ్బారెడ్డిని మాటలతో మేనేజ్ చేయాలని చూశాడు.

ఇప్పుడు ఆ చంద్రబాబు మాటలే పూర్తిగా వికటించినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు హామీలను ప్రజలు కూడా నమ్మని స్థితిలో ఉన్నారు. అలాగే నాయకులకు కూడా చంద్రబాబు మాటలపై అస్సలు నమ్మకం లేని పరిస్థితి ఉందని ఎవి సుబ్బారెడ్డి తీరుతో స్పష్టమైపోయింది. తాజాగా తన అనుచరులతో సమావేశమైన ఎవి సుబ్బారెడ్డి…….2019లో ఆళ్ళగడ్డ నుంచి పోటీ చేయబోయేది తానేనని, గెలుపు కూడా మనదే కావాలని అన్నాడు. ఇప్పుడు ఈ విషయంపైనే అఖిల ప్రియ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆళ్ళగడ్డ నుంచి గెలిచి మంత్రి స్థాయిలో నేనుండగా 2019లో ఆళ్ళగడ్డ టిక్కెట్‌ని ఎవి సుబ్బారెడ్డి ఎలా ఆశిస్తాడని ఆవేశంగా మాట్లాడింది అఖిలప్రియ. అసలు భూమా కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే సీట్లపై ఎవి సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని నిలదీసింది. మొత్తంగా చూస్తే ఎవి సుబ్బారెడ్డి-అఖిలప్రియల మధ్య సయోధ్య కుదర్చాలని బాబు చేసిన పంచాయితీ అయితే అట్టర్ ఫ్లాప్ అయినట్టుగానే కనిపిస్తోంది. ఇంతకుముందు కంటే కూడా ఇకపైన ఎవి సుబ్బారెడ్డి-అఖిల ప్రియల మధ్య రాజకీయ యుద్ధం నెక్ట్స్ లెవెల్‌లో ఉండే అవకాశం ఉంది. రాజకీయాల కోసం, పర్సంటేజీల కోసం వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఓట్లేసిన ప్రజలను మర్చిపోయారన్న అసలు విషయాన్ని ప్రజలు పసిగడితే మాత్రం 2019లో మొత్తానికే టిడిపి పుట్టిమునగడం ఖాయం అన్న అభిప్రాయాలైతే వినిపిస్తూ ఉండడం గమనార్హం. కానీ అధికారంలో ఉన్నవాళ్ళ చెవులకు ఇలాంటి మాటలు వినిపిస్తాయా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -