రాష్ట్రంలో భాజాపా, టీడీపీల మధ్య మాటల యుద్ధం ఏమాత్రం సద్దుమనగడంలేదు. భాజాపాతో విడిపోయిన తర్వాత ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకోవడం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం సహకరించడంలేదని భాబు ఆరోపిస్తుంటే….కేంద్రం అమలు చేస్తున్న పథకాలను తాము అమలు చేస్తున్నట్లుగా బాబు ప్రచారం చేసుకుంటున్నారని భాజాపా విమర్శలు చేస్తోంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక రైల్వేజోన్ ఇస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. తాజాగా రైల్వేజోన్ ప్రకటించడంతో రాష్ట్ర భాజాపా నేతల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్రానికి మొక్కబడిగా రైల్వే జోన్ ఇచ్చారని బాబు చేసిన విమర్శలకు…భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అదిపోయో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ‘స్టిక్కర్ బాబు’ అంటూ ఓ ట్వీట్ చేశారు.
మీరు రాష్ట్ర ఆదాయ వనరులనూ, కేంద్ర నిధులనూ ఇన్నాళ్ళుగా పాలు పిండినట్టు పిండేసి.. రైల్వే జోన్ ద్వారా పిండుకోవడానికి మీకు ఏమీ లేదని ఆక్రోశంతో మాట్లాడుతున్నట్టున్నారంటూ మండిపడ్డారు. జోన్ ఏర్పాటు వల్ల వచ్చే ఆదాయం, లాభ నష్టాలను భారత రైల్వే చూసుకుంటుంది. రైల్వే జోన్ మీద మీరు స్టిక్కర్ వేయడం కుదరదులే’ అంటూ కన్నా సెటైర్లు విసిరారు. లేకపోతే ఈపాటికి రైల్వే జోన్ కూడా నా వల్లే వచ్చిందని ప్రచారం చేసుకొనేవారు బబు. అందుకే కేంద్రం అలాంటి అవకాశం ఇవ్వకుండా చేసింది.
