2019ఎన్నికల కోసం ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఇంటింటికీ కిలో బంగారం, కోటి రూపాయల కార్లు…… ఇలా ఏవేవో ఇస్తానంటాడు చంద్రబాబు…..ఆ హామీలను నమ్మి మోసపోతే 2014 ఎన్నికల తర్వాత చేసినట్టు మరోసారి మోసం చేస్తాడు చంద్రబాబు అని జగన్ చెప్తూనే ఉన్నాడు. కానీ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయ వ్యూహాలను, అబద్ధాలను పసిగట్టే సత్తా జగన్‌కి ఎక్కడుంది? అదే ఉండి ఉంటే 2014లోనే చంద్రబాబుపై గెలిచి ఉండేవాడు జగన్. ఈ సారి కూడా జగన్ ఊహలకు కూడా అందని స్థాయి హామీని ఇచ్చేశాడు చంద్రబాబు.
ఎన్డీఏ నుంచి తన మంత్రులను ఉపసంహరించుకున్న తర్వాత నుంచీ కూడా ప్రధాని పదవిపై, కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాడు చంద్రబాబు. చివరికి దేశ సమగ్రతను దెబ్బతీసేలాంటి ఉత్తర-దక్షిణ భారతదేశ సెంటిమెంట్‌ని రగిల్చి ప్రజల మధ్య విభేదాలు సృష్టించే వ్యూహాన్ని కూడా అమలు చేశాడు. తెలంగాణా-సీమాంధ్ర ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే తెలుగు ప్రజలే నష్టపోయారు. ఇక ఉత్తర-దక్షిణ భారతదేశం అనే సెంటిమెంట్ మోసపోయి ఉన్నవాళ్ళకు బాగానే అనిపించొచ్చు. కానీ అంతిమంగా మాత్రం మొత్తం భారతీయుల మధ్య అపనమ్మకాలు, విబేదాలు తలెత్తే పరిస్థితి వస్తుంది. వినాశనానికి దారితీస్తుంది. అంతటి వినాశకాల రాజకీయాలకు కూడా తెరతీశాడు చంద్రబాబు.
ఇప్పుడు ఆ రాజకీయాన్ని క్యాష్ చేసుకుంటూ 2019ఎన్నికలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారీ హామీని ఇచ్చేశాడు చంద్రబాబు. 2019ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని చంద్రబాబే నిర్ణయిస్తాడని స్వయంగా చెప్పుకొచ్చాడు చంద్రబాబు. 2014ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన ప్రధాని అభ్యర్థి మోడీకి ఓట్లేసి నిండా మునిగిపోయారు సీమాంధ్రప్రజలు. ఇక 2019లో ప్రధాని అభ్యర్థిని తానే నిర్ణయిస్తాను అని చెప్పి ఓట్లు అడగడానికి రెడీ అవుతున్నాడు బాబు. అయినా అతి చిన్న రాష్ట్రం……. అత్యంత తక్కువ స్థాయిలో ఎంపిలను గెలుచుకునే అవకాశం ఉన్న చంద్రబాబు ప్రధానమంత్రి ఎవరో ఎలా నిర్ణయించగలడు? అలాంటి ప్రశ్నలు మాత్రం అస్సలు అడక్కూడదు. అవసరమైతే 2019తర్వాత నేనే ప్రధానిని అయి ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరిస్తా అని చంద్రబాబు చెప్పినా సరే…….. గుడ్డిగా నమ్మేయాల్సిందే. అక్కడున్నది కలికాల సత్య హరిశ్ఛంద్రుడు మరి.
