Monday, May 6, 2024
- Advertisement -

కుప్పంలో చంద్రబాబు వరుస విజయాలు…. ఆ ఛీప్ ట్రిక్‌తో గెలిచాడంటన్న పచ్చ మీడియా

- Advertisement -

జగన్‌ని తిట్టాల్సి వచ్చినా……బాబును పొగడాల్సి వచ్చినా పచ్చ మీడియా జనాలకు పూనకం వచ్చేస్తుంది. జగన్‌కి తోకలో ఈక పరిచయం ఉన్న ఎవరో ఒకరు తప్పు చేస్తే జగన్ వళ్ళ దేశం పరువుపోతోంది అని పేజీలకు పేజీలు ఆవేశపడిపోతారు. అదే బాబుగారి వెన్నుపోటు ఎపిసోడ్, ఓటుకు కోట్లు కొనుగోలు వ్యవహారాలు మాత్రం తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం చంద్రబాబు చేస్తున్న అవిశ్రాంత యజ్ఙంలా కనిపిస్తుంది పచ్చ మీడియాకు. తాజాగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబును మహోన్నతుడిగా చూపించడానికి అహో రాత్రులూ కష్టపడుతున్న పచ్చ మీడియా కుప్పంలో వరుసగా గెలవడానికి బాబు పన్నుతున్న ఛీప్ ట్రిక్స్‌ని కూడా గొప్పవిగా చెప్పుకుంటూ పోయింది. ఆ ప్రాసెస్‌లోనే బాబు ప్లాన్ చేసే ఆ ఛీప్ ట్రిక్స్ గురించి జనాలకు సవివరంగా చెప్పేసింది.

సాధారణంగా ఒక నాయకుడు ఒకే నియోజకవర్గం నుంచి గెలుస్తున్నాడంటే అక్కడి ప్రజల్లో ఆ నాయకుడిపై ప్రజాదరణ పెరుగుతూ ఉండడం……ఆ నియోజకవర్గాన్ని ఆ నాయకుడు చేసిన అభివృద్ధి కారణమై ఉండాలి. కానీ చంద్రబాబు కుప్పంలో గెలవడానికి ప్రధాన కారణాలు మాత్రం అలాంటివి కాదట. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను తన పార్టీలోకి జంప్ చేసేలా చేస్తూ ఉంటాడట. ఈ జంపింగ్ వ్యవహారాల వెనుక కొనుగోలు వ్యవహారాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. కుప్పం నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి పోటీ చేసే బలమైన నాయకులను అలా చంద్రబాబు తన క్యాంప్‌లో మార్చేసుకుంటాడట. చంద్రబాబు వరుస గెలుపుల వెనుక ఈ వ్యూహమే కారణమని ఆంధ్రజ్యోతి చాలా వివరంగా చెప్పేసింది. ఇతర పచ్చ మీడియా సంస్థలు కూడా ఈ వార్తను గొప్పగా ప్రచురించాయి. అన్నింటికీ మెటీరియల్ ఎన్టీఆర్ భవన్ నుంచే వస్తుంది కదా.

కుప్పంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఇతర పార్టీల అభ్యర్థులను చంద్రబాబు టిడిపిలోకి జంపింగ్ చేయిస్తాడట….. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రత్యర్థి పార్టీలకు కొత్తగా అభ్యర్థిని ఎంచుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఆ అభ్యర్థిని కూడా చంద్రబాబు తన పార్టీలోకి జంపింగ్ చేయించడం…..ఆ రకంగా గెలుస్తూ ఉండడం జరుగుతోందట. 2014లో వైకాపా తరపున పోటీచేసిన అభ్యర్థిని కూడా చంద్రబాబు ఆల్రెడీ టిడిపిలోకి జంప్ చేయించేశాడని కూడా గొప్పగా చెప్పుకొచ్చింది పచ్చ మీడియా. అదేంటో మరి బాబు కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిలాంటి వాళ్ళు చెప్పే అవినీతి వ్యవహారాలు, ఓటుకు నోట్లు కొనుగోళ్ళు, ఇతర పార్టీల నాయకులను అనైతికంగా జంపింగ్స్ చేయించడం…కోట్లాది రూపాయలతో కొనుగోళ్ళు చేయడం……ఇలా బాబుకి సంబంధించిన అవినీతి, అక్రమ వ్యవహారాలు కూడా పచ్చ మీడియాకు మాత్రం అభివృద్ధి యజ్ఙాలుగానే కనిపిస్తూ ఉంటాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -