Sunday, May 12, 2024
- Advertisement -

వైకాపాలో ఎప్పుడు చేరబోతున్నావ్? సోమిరెడ్డిపై చంద్రబాబు ఆగ్రహం

- Advertisement -

సొంత నేతలపైనే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు……………టిడిపి ఎమ్మెల్యే, విప్ స్థాయి నాయకుడి చేరికే నైతికంగా చంద్రబాబుకు అపజయం అనడంలో సందేహం లేదు. ఇక తాజాగా టిడిపి సీనియర్ నేతల వ్యూహాలు కూడా చంద్రబాబులో గుబులు పెంచుతున్నాయి. అందుకే చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కి వెళ్ళిపోతోందని స్వయంగా టిడిపి నేతలే అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి గెలుపును కనీసం టిడిపి సీనియర్ నేతలు కూడా విశ్వసించకపోవడం చంద్రబాబులో ఆందోళన పెంచుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపి గెలిచే అవకాశమే లేదు అన్న నిర్ణయానికొచ్చిన టిడిపి సీనియర్ నేతలు కొందరు ఎంచక్కా వాళ్ళ కుటుంబ సభ్యులను జగన్ పార్టీలోకి పంపిస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తాడని ఖాయంగా నమ్ముతున్న ఈ నాయకులు సొంత కుటుంబ సభ్యులను, బంధువులను వైకాపాలో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ఈ నాయకుల వెన్నుపోటు రాజకీయం తెలుసుకున్న చంద్రబాబు ఆయా నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడని టిడిపి నాయకులు చెప్తున్నారు.

టిడిపిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబుకు అత్యంత నమ్మకస్తుడు. అందుకే సోమిరెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే అలాంటి సోమిరెడ్డి కూడా తన సొంత బావను 2019 ఎన్నికల్లో జగన్ గెలుపుపై నమ్మకంతో ఎంచక్కా వైకాపాలోకి పంపించడం పట్ల మాత్రం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని ఒక సీనియర్ టిడిపి నాయకుడు చెప్పుకొచ్చారు. అధికారంలో లేకపోతే ఐదేళ్ళు భరించలేరా? ఎంతకైనా తెగిస్తారా అంటూ కొందరు టిడిపి నాయకులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. పొత్తులతో అయినా సరే 2019 ఎన్నికల్లో కూడా మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని నాయకులందరికీ భరోసా కలిగించే ప్రయత్నం చేశాడట చంద్రబాబు. మరి ఈ పరిణామాల తర్వాత అయినా టిడిపి నాయకుల జంపింగ్స్‌కి అడ్డుకట్ట పడుతుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -