Sunday, May 5, 2024
- Advertisement -

బాబు ప్లాన్ కి జగన్ ఎలాంటి ఎత్తువేస్తాడు…!!

- Advertisement -

టీడీపీ నమ్మదగ్గ నియోజకవర్గాల్లో ఒకటి గన్నవరం నియోజక వర్గం.. అక్కడ టీడీపీ జగన్ ప్రభంజనం లో కూడా వల్లభనేని వంశీ రూపంలో సీటు ను దక్కించుకుంది.. అయితే వల్లభనేని తర్వాత జగన్ కు జై కొట్టిన సంగతి తెలిసిందే.. దాంతో టీడీపీ మళ్ళీ ఆ నియోజక వర్గంలో వీక్ అయ్యింది.. అయితే అక్కడి టీడీపీ లీడర్ లు మాత్రం వంశీ చేసిన నమ్మక ద్రోహాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.. జగన్ మేనియా ఉన్న రాష్ట్రంలో ఎంతో కష్టపడి టీడీపీ ని గెలిపించుకుంటే వంచి ఇలా నమ్మక ద్రోహం చేసి జగన్ కి సపోర్ట్ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.. దాంతో వంశీ ప్రత్యామ్నాయ అభ్యర్థి ని తయారుచేయాలని చంద్రబాబు ను కోరగా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు బాబు..

అయితే ముందునుంచి గన్నవరంపై వంశీ ఉన్నంత పట్టు ద్వితీయ శ్రేణి నాయకులకు లేదు.. దాంతో అంత ఈజీ గా టీడీపీ అక్కడ సరైన నాయకుడు దొరికే అవకాశాలు కనిపించడం లేదు.. గత పది సంవత్సరాలుగా అక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయకపోవటంతో ఇప్పుడు పార్టీలో సరైన నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇదే అదనుగా ఇతర పార్టీల్లోని బలమైన నేతలు టిడిపి వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఒక మహిళా నేత పార్టీలో స్థానం కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఆమె ఏఐసిసి ఉపాధ్యక్షురాలుగా ఉన్న సుంకర పద్మ శ్రీ..

ఈమె ఈ నియోజక వర్గంలో ఇప్పుడిప్పుడే బలమైన నేతగా ఎదుగుతున్నారు. ఎక్కువగా తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని ఆమె చేస్తున్న కార్యక్రమాలే తెలియచేస్తున్నాయి. ఆమె ఎంత బలమైన నాయకురాలిగా ఎదిగినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం లేకపోవడం, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిలబడే అవకాశాలు లేకపోవడంతో ఇప్పుడు ఆమె తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితురాలు అవుతున్నట్లు తెలుస్తుంది. వంశీకి ఆమెకు మధ్య వ్యక్తిగత వైరం కూడా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఒక ఆర్థిక సహాయం విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లోపు ఆమె టిడిపి తీర్ధం పుచ్చుకుంటే, ఆమెకు చంద్రబాబునాయుడు సీటు ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వకపోవచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏదైతేనం చంద్రబాబు గన్న వారంలో మంచి కాండిడేట్ అయితే దొరికేసినట్లే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -