Friday, May 3, 2024
- Advertisement -

బాబుకు గ‌ల్లీల‌ల్లో ప్ర‌చారం చేయాల్సిన ఖ‌ర్మేంటి…

- Advertisement -

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించిన ఫొటోలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి హోదాలో బాబు వీధులు, సందుల గుండా రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నాడు. ఒకవైపు నంద్యాల్లో విజయం తమదే అని.. మరోవైపు సందుగొందులను కూడా వదలక బాబుగారు తిరుగుతున్నారు. ఇదే ఇప్పుడు ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

బాబుతో పాటు మంత్రులంద‌రు టీడీపీ విజయం ఖరారు అయినందని ఊద‌ర‌గొడుతున్నారు. మ‌రి విజ‌యం ఖాయం అని చెప్పిన‌పుడు సీఎం ఇంత గ్రౌండ్ లెవల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందో. ముఖ్యమంత్రి హోదాల్లో ఏదో ప్రధాన సర్కిల్స్ లో ప్రచారం చేస్తే అదో లెక్క కానీ.. మరీ ఇలా గల్లీల్లోకి రావడం మాత్రం విడ్డూరంగా కినిపిస్తోంది. గల్లీలోకి వచ్చేసరికి జనసమీకరణ లేక బాబు రోడ్ షో వెలవెలబోయింది. ప్రచార వాహనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి అఖిలప్రియ, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిలు ఉన్నా.. రోడ్లపై మాత్రం జనాలు కనిపించలేదు.

బాబును చూడటానికి వచ్చిన జనాల కన్నా బాబు సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువ మంది కనిపించారు. కనిపించిన నాలుగైదుగురికీ చంద్రబాబు విక్టరీ సింబల్ చూపిస్తూ ముందుకు సాగారు. నంద్యాల్లో జగన్ పది రోజులుగా తిరుగుతున్నాడు. వెలుగులోకి వస్తున్న ప్రతి ఫొటోలోనూ విపరీతంగా జనాలు అగుపిస్తున్నారు. చంద్రబాబు తిరిగింది పది రోజులు కాదు… మూడో విడత ప్రచారానికి వచ్చిన కొన్ని గంటల్లోనే, బాబు చుట్టూ జనాలు లేకుండా పోవడం గమనార్హం.

ప్రధాన సర్కిల్స్ లో కాస్తంత జనం కనిపించినా.. రోడ్లపైకి వచ్చేసరికి ఇదీ పరిస్థితి. మరి ఎక్కడ తేడా కొట్టింది అంటే.. తెలుగుదేశం నేతలంతా జగన్ రోడ్ షోలకు జనం వెళ్లకుండా చూసుకోవడంలో బిజీగా ఉన్నారని, డబ్బులిచ్చి మరీ జనాన్నిదూరంగా తరలిస్తున్నారని, జగన్ రోడ్ షో జరిగే రూట్లలో ముందస్తుగానే టీడీపీ నేతలు ఈ ఏర్పాట్లు చేస్తున్నరని స్పష్టం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -