Monday, May 6, 2024
- Advertisement -

కుప్పంలో విజయంపైన బాబుకు డౌటా……. రహస్య సర్వే మర్మమేంటి?

- Advertisement -

కాంగ్రెస్ తరపున చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అక్కడి నుంచి బిచాణా ఎత్తేశాడు చంద్రబాబు. సేఫ్ సైడ్ ఆలోచించి బలమైన ప్రత్యర్థులు, నాయకులు ఎవరూ లేని కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుంచీ వరుసగా కుప్పం నుంచి గెలుస్తూ ఉన్నాడు చంద్రబాబు. అయితే 2014 ఎన్నికల్లో వైకాపా తరపున రిటైర్డ్ ఐఎఎస్ పోటీ చేయడం చంద్రబాబును కాస్త చికాకు పెట్టింది. ఎన్నికలయ్యాక కూడా ఆ ఐఎఎస్ అధికారి అనుక్షణం ప్రజల్లో ఉంటూ ఉండడం చంద్రబాబులో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కుప్పం నుంచి లోకేష్‌ని పోటీ చేయించాలన్న ఆలోచనకు వచ్చాడు చంద్రబాబు.

తన వర్గ జనాభా బలంగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలనుకుంటున్నాడు. అయితే అసలు కుప్పంలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? లోకేష్ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉందా? 2014 ఎన్నికల హామీలపై కుప్పం ప్రజలు కూడా భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పుడు కుప్పంలో ప్రజావ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనే విషయంపై తెదేపా రహస్యంగా సర్వేలు చేయిస్తోంది. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు మార్క్ వ్యూహం పన్నుతున్నారని స్థానిక జర్నలిస్టులు కామెంట్స్ చేస్తున్నారు.

ఆ సర్వే చేస్తున్నవాళ్ళందరూ కూడా వైకాపా, బిజెపి, జనసేనలాంటి పార్టీల నుంచి వచ్చామని చెప్పాల్సిందిగా టిడిపి నాయకులు సూచించారని స్థానిక జర్నలిస్టుల విశ్లేషణలో తేలడం కుప్పం ప్రజలను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. తెదేపా నుంచి వచ్చామని చెప్తే నిజాలు చెప్పరేమో అన్న ఉద్ధేశ్యంతో ఇతర పార్టీల నుంచి వచ్చినట్టుగా చెప్పాలని చెప్పి సూచనలు చేశారేేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా విజయావకాశాలపై చంద్రబాబుకు నమ్మకం లేదా అన్న ఆలోచన మాత్రం టిడిపి శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. సర్వేలతో పాటు జనాభిప్రాయాలన్నీ కూడా 2019లో వైకాపానే అధికారంలోకి వస్తుంది అని నమ్మకంగా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆందోళనగా ఉన్న టిడిపి నేతలు, కార్యకర్తలను ఇప్పుడు కుప్పంలో విజయావకాశాలపై చంద్రబాబు సర్వే చేయించడం మరింతగా టెన్షన్ పెడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -