Tuesday, May 14, 2024
- Advertisement -

ఫిరాయింపు నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్న చంద్రబాబు నిర్ణయం

- Advertisement -

మూడేళ్ళ అధికారం కోసం……… పాతిక-ముఫ్ఫై కోట్ల రూపాయల డబ్బు కోసం కక్కుర్తి పడి పార్టీ ఫిరాయించిన నేతల రాజకీయ భవిష్యత్తుకు మరణశాసనం రాసే నిర్ణయాన్ని చంద్రబాబు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఈ నిర్ణయమే ఫిరాయింపు నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. అధికార యావ, కుర్చీపైన ప్రేమ తప్ప చంద్రబాబుకు మానవీయ విలువలు, నైతిక విలువలు అంటూ ఏమీ ఉండవు అని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. పిల్లనిచ్చిన మామ, దారుణంగా ఓడిపోయినప్పటికీ పిలిచి పదవిని కూడా కట్టబెట్టిన మామకు వెన్నుపోటు పొడిచి చివరి దశలో ఆయన ఆవేదనకు కారణమైనా, బిజెపి నుంచీ కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా, ఇప్పుడు చివరకు కాంగ్రెస్‌తో కలిసినా………..వేరే ఏం చేసినా కూడా పదవి కోసమే అన్నది బహిరంగ రహస్యం. అలాగే పదవి కోసం ఏమైనా చేయడానికి రెడీ అవుతాడు అన్న విషయాన్ని స్వయంగా టిడిపి నేతలు కూడా ఒప్పుకుంటారు.

అలాంటి చంద్రబాబు 2019లో అధికారం కోసం ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నాడు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయమే ఫిరాయింపు నేతల గుండెల్లో రైళ్ళు పరుగెట్టిస్తోంది. కర్నూలు ఎంపి బుట్టా రేణుక ఆల్రెడీ చంద్రబాబుతో తన ఆవేదన పంచుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్-టిడిపి పొత్తులో భాగంగా కర్నూల్ ఎంపి సీటుకు కాంగ్రెస్ తరపున కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పోటీ చేయనున్నారు. అలాగే ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఫిరాయింపు నేతల సీట్లను కాంగ్రెస్‌కి ఇవ్వనున్నాడు చంద్రబాబు. అసలే ఎమ్మెల్యే సీట్లు పెరగడం గ్యారెంటీ అని చెప్పి వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఫిరాయించేలా చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్ల పెరుగుదల లేదు అని తెలిసిపోయింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ ఉన్న సీట్లలో టిడిపి నేతలకు-ఫిరాయింపు నేతలకే సీటు కోసం యుద్ధం జరుగుతోంది. ఇప్పుడిక పొత్తులో భాగంగా కాంగ్రెస్‌తో పాటు, ముందు ముందు పొత్తు పెట్టుకోనున్న కమ్యూనిస్టులకు కూడా సీట్లు కేటాయిస్తే ఫిరాయింపు నేతల్లో ఒకరిద్దరు సీనియర్ నాయకులు మినహా ఎక్కువమందికి మొండి చెయ్యి గ్యారెంటీ అన్న విషయం అర్థమవుతోంది. ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా….. ఫిరాయింపు నేతలందరూ కూడా నమ్మినవాళ్ళను నట్టేట ముంచడం, నమ్మినవాళ్ళకు వెన్నుపోటు పొడవడం అనే చంద్రబాబు నైజం తెలిసి కూడా డబ్బుకు ఆశపడి టిడిపిలో చేరినందుకు ఇప్పుడు వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉండడం…… ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్న సామెతను గుర్తుచేస్తోందని అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -