Sunday, May 5, 2024
- Advertisement -

అధిష్టానంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నేత‌లు..

- Advertisement -

సొంత జిల్లా చిత్తూరులో చంద్ర‌బాబుకు సొంత పార్టీలోనె మ‌రో త‌ల‌నొప్పి మొద‌ల‌య్యింది. నామినేటెడ్ పోస్ట్‌లు భ‌ర్తీ చేయ‌కోవ‌డంతో తెలుగు తమ్ముల్లంతా అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఇప్ప‌టి కైనా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కోరుతున్నారు. బాబు అధికారంలోకి రాగానె నామినేటెడ్ పోష్ట్‌ల‌ను ర‌ద్దు చేయ‌డంతో కాంగ్ర‌స్ పార్టీ నేత‌లు అనుభ‌విస్తున్న ప‌ద‌వుల‌కు దెబ్బ‌ప‌డింది. ఆ ప‌ద‌వుల‌న్నీత‌మ‌కే వ‌స్తాయ‌ని ఆశ‌లు పెట్టుకున్న తెలుగు త‌మ్ముళ్ల ఆశ‌లుపై ప్ర‌తీసారి నీల్లు చ‌ల్లుతున్నారు చంద్రబాబు.

నామినేటెడ్ ప‌ద‌వుల‌పై ఆశ వ‌హులు ఎక్కువ‌వుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. చిత్తూరులో జిల్లా, రాష్ర్టస్థాయి పదవులు ఎన్నో ఉన్నాయి.ఆచరణలో మాత్రం అది అంతగా అమలు కావడం లేదన్నది టీడీపీ శ్రేణుల ఆవేద‌న చెందుతున్నారు.

నామినేటేడ్ పోస్టులకు ఏడాదిపాటే గడువు నామినేటేడ్ పదవుల కోసం ఆశావహులను ఊరించడమే తప్ప అవేవీ భర్తీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. ధైర్యంగా ఆడుగు దామ‌నుకుంటె భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని వెన‌క‌డుగు వేస్తున్నారు. 2019లో ఎలాగూ ఎన్నికలు ఒక్క ఏడాది ఉన్నా ఎందుకు అధిష్టానం సాచివేత ధోర‌ని కినిపిస్తుందో అర్థం కావ‌డంలేదు.

జిల్లాలో ఉన్న అన్ని రకాల నామినేటెడ్‌ పదవులను సకాలంలో భర్తీ చేసి ఉన్నట్లయితే సుమారు 600 మందికి పదవులు లభించి ఉండేవని గణాంకాలు చెబుతున్నారు. వ్యవసాయమార్కెట్‌ కమిటీ పదవుల విషయానికి వస్తే జిల్లాలో మొత్తం 19 కమిటీలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు అంతగా ప్రాధాన్యం లేని కమిటీలకు మాత్రం నియామకాలు జరిగాయి.. ప్రాధాన్యత కలిగిన కమిటీలను మాత్రం అధిష్టానం పట్టించుకోవడం లేదు. 35 దేవాల‌యాల‌లో 14 వాటికే పాల‌క క‌మిటీల‌ను నియ‌మించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేత‌లు వ్య‌వ‌హారం బాబుకు త‌ల‌నొప్పిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -