Monday, May 6, 2024
- Advertisement -

త‌లాక్ బిల్లుకు టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తుందా …? వ‌్య‌తిరేకిస్తుందా…?

- Advertisement -

ఏపీలో ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య పొత్తుపై మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. పొత్తు ఉండాలో లేదో మీరు తేల్చుకోండంటూ టీడీపీ…కాదు మీరే తేల్చుకోండంటూ భాజాపా ఇద్ద‌రూ ఒరక‌రిమీద ఒక‌రు మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. సాక్షాత్తు చంద్ర‌బాబే పొత్త వ‌ద్ద‌నుకుంటే మీకో దండం పెట్టి త‌ప్పుకుంటామంటూ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన‌త్య సంత‌రించ‌కున్నాయి.

భాజాపాతో పొత్తు ఉంటుందో లేదో పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో తేలిపోతుంది. గడచిన మూడున్నరేళ్ళల్లో కేంద్ర ప్రభుత్వం ఏ దశలోనూ టిడిపిని లెక్క చేయలేదు. అస‌లు చంద్ర‌బాబ‌కే ఏడాదిన‌ర్ర‌పాటు అపాయంట్‌మెంట్ ఇవ్వ‌లేదంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు.

విభ‌జ స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌యిన ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్, రెవిన్యూలోటు భర్తీ ఇలా..ఏ అంశం తీసుకున్నా రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యే చూపిందన్నది వాస్తవం. ఇన్నాల్లు మౌనంగా ఉన్న బాబు ఇప్పుడు కేంద్ర‌మీద దిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. మూడున్నరేళ్ళ పాలనపై ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను కేంద్రంపై మళ్ళించి తాను లబ్దిపొందుదామన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది. బాబు ఎత్తుగ‌డ‌ను గ‌మ‌నించిన భాజాపా ఎదురుదాడికి దిగుతోంది.

ఇటువంటి పరిస్ధితుల్లో సోమవారం నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సందర్భంలోనే విభజన హామీల అమలు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రప్రభుత్వంపై టిడిపి ఒత్తిడి పెంచాలని టిడిపి అనుకుంటోందట.

ప్ర‌జ‌ల‌కోస‌మైనా స‌మావేశాల్లో కేంద్రాన్ని నిల‌దీయాల్సిన ప‌రిస్థితి. పోయిన శీతాకాల సమావేశంలో ‘తలాక్’ బిల్లును వ్యతిరేకించింది. అదే బిల్లు మళ్ళీ ఈసారి సమావేశాల్లో చర్చకు వస్తోంది. ఒకవేళ భాజపాతో గనుక పొత్తు వద్దనుకుంటే టిడిపి ఎన్డీఏకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. బిల్లుకు మ‌ద్ద‌తు తెలుపుతుందా లేకా వ్య‌తిరేకిస్తుందా అనేది చూడాలి.

మ‌రో వైపు ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఎన్‌డీఏ వైసీపీ వైపు చూస్తోందా అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌త్యేక‌హోదా ఇస్తే భాజాపాతో క‌ల‌సి ప‌నిచేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అధిష్టానం ఆదేశాల‌తోనే భాజాపా నేత‌లు టీడీపీ పై ఎదురు దాడి చేస్తున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనే పొత్తు తేల‌నుంది. త‌లాక్ బిల్లును టీడీపీ వ్య‌తిరేకిస్తే మాత్రం బంధం తెగిపోయిన‌ట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -