Sunday, May 5, 2024
- Advertisement -

నిజామాబాద్ బ‌హిరంగ‌స‌భ‌లో ఉద్యోగుల‌కు కేసీఆర్‌ వ‌రాల‌ జల్లులు

- Advertisement -

నిజామాబాద్ బ‌హిరంగ‌స‌భ‌లో ఉద్యోగుల‌కు కేసీఆర్‌ వ‌రాల‌జ ల్లులు కురిపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధికారంలోకి వ‌స్తే ఉద్యోగుల‌కు న్యాయ‌మైన ఫిట్ మెంట్ ఇవ్వ‌డంతోపాటు…పదవీవిరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు కలిసిరావాలని పిలుపునిచ్చారు కేసీఆర్. అన్ని హామీలు నెరవేరాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు.

ఇకపై శ్రీరాంసాగర్‌ ఎండిపోదని, కాళేశ్వరం నీళ్లతో శ్రీరాంసాగర్‌ నింపుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతు రుణమాఫీ చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ధనిక రైతులకే రూ.2 లక్షల రుణాలు ఉంటాయని, మళ్లీ అధికారంలోకి వచ్చాక రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ కేసీఆర్ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్, ముథోల్, నిర్మల్, ఇచ్చోడ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఆశీర్వాద బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -