Monday, May 13, 2024
- Advertisement -

విప్ ప‌ద‌వి నుంచి పార్థ‌సార‌థి తొల‌గింపు…

- Advertisement -

సీఎం వైఎస్ జ‌గ‌న్ ఎప్పుడు ఎవ‌రికి షాక్ ఇస్తారో తెలియ‌దు. ఎవ‌రికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వాల్నో ఎవ‌రికి ఇవ్వ‌కూడ‌దో జ‌గ‌న్‌కి తెలిసిన‌ట్లు ఎవ్వ‌రికి తెలియ‌దు. సామాజికి న్యాయం కోసం సొంత బంధుల‌ను సైతం లెక్క చేయ‌డు. జ‌గ‌న్ కేబినేట్ కూర్పు ఇలా ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించారు. అంద‌రికి షాక్ ఇస్తూ 25 మందితో మంత్రి వ‌ర్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే మంత్రిప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్న కొంద‌రు నేత‌ల‌కు జ‌గ‌న్ చీఫ్ విప్, విప్ పదవులను కేటాయించారు.

తాజాగా, మరో ముగ్గుర్ని ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, తొలుత విప్‌గా నియమించిన మాజీ మంత్రి కొలుసు పార్థసారధిని తొలిగించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి‌లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు.

జగన్ నియమించే ఐదుగురు డిప్యూటీ సీఎంలలో పార్థసారథి కూడా ఉంటారని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా వారి స్థానంలో వేరేవారిని ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే పార్థసారధిని విప్ పదవి నుంచి తొలగించడానికి కారణం ఏంటనే చర్చ సాగుతోంది. ఆయనకు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తారా? అని చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -