Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీలో కొత్త జిల్లాలు అవసరమా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

ఈ యేడాది ఉగాది (ఏప్రిల్ 2) నాటికి కొత్త జిల్లాల నుంచే పాలన సాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దిశగా ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాలతో పాటు ఇతర ఆఫీసుల ఏర్పాటుకు భవనాలను గుర్తించే పనిలో ఉన్నతాధికారులు బిజీబిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పడి వేల కోట్ల నిధులు కావాలని, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అప్పుల్లో ఉందని ఇటువంటి పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు అంత అవసరమా అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆనం వ్యాఖ్యలపై వైసీపీ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ ఎన్నికలకు ముందు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఉగాది నాటికి ప్రక్రియను పూర్తి చేయాలిన జగన్ సంకల్పించారు. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 కానున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -