జనసేన పార్టీలోకి చిన్నగా వలసలు ఊపందుకుంటున్నాయి. ఎక్కవగా కాంగ్రెస్ పార్టీనుంచి ఆ పార్టీలో నాయకులు చేరుతున్నారు. ఇప్పటికే నాదెండ్ల జనసే కండువా కప్పుకోగా ..తాజాగా మరో మంత్రి పవన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలోపేతం అవుతోందని పార్ట నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు నేపథ్యంలో హస్తం పార్టీకి సీనియర్ నేతలు షాక్ ఇస్తున్నారు. పొత్తును వ్యతిరేకిస్తున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన పార్టీలో చేరారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
గత కొంతకాలంగా.. పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో జనసేన బలం పెరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. క్షేతస్థాయిలో వాస్తవాలు తెలియకుండా ప్రజా సమస్యలపై పోరాడలేమని పవన్ కల్యాణ్ నమ్ముతారని తెలిపారు.
పవన్ కల్యాణ్ వంతాడకు వెళుతుంటే మాఫియా మట్టిని వేసి రోడ్డును మూసేసిందనీ, జనసేనతో అవినీతిపరులు భయపడుతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని వెల్లడించారు. పవన్ కల్యాణ్ తో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
