Thursday, May 16, 2024
- Advertisement -

ఫిరాయింపు నేతకు సొంత పార్టే దిక్కా….?

- Advertisement -

అడ్డ‌గోలుగా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన చంద్ర‌బాబుకు ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. పార్టీలో చేరేట‌ప్పుడు మంత్రిప‌ద‌వులు ఆశ చూపిన బాబు త‌ర్వాత వారికి హ్యాండిచ్చారు. ఇప్పుడు అదే బాబుకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఫిరాయింపునేత‌లు బాబుకు షాక్ ఇవ్వ‌నున్నారు. జ‌గ‌న్ అపాయంట్‌మెంట్ కోసం వేచిచూస్తున్నారు నేత‌లు.

ఈనెల 23న రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మూడో అభ్య‌ర్తిని నిల‌బెట్ట‌డంపై బాబు నానా తంటాలు ప‌డుతున్నారు. భాజాపాతో సంబంధాలు అంతంత‌మాత్ర‌మే ఉన్నాయి. ఇంతలో హటాత్తుగా ఫిరాయింపు ఎంఎల్ఏల రూపంలో చంద్రబాబుకు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయని సమాచారం.

వైసిపి నుండి టిడిపిలోకి ఫిరాయించిన 22 మంది ఎంఎల్ఏల్లో అందరూ కంఫర్టబుల్ గా లేరు. నలుగురు ఫిరాయింపు మంత్రులను వదిలేస్తే మిగిలిన 18 మందిలో మెజారిటీ ఎంఎల్ఏల పరిస్ధితి అత్యంత‌ దయనీయంగా ఉంది. టిడిపిలోకి ఎందుకు ఫిరాయించామా అని వారిలో వారే మదనపడుతున్నారు. టీడీపీలో పేరుకే ఎమ్మెల్య‌లు కాని నేత‌లు ఎవ‌రూ వారికి విలువ‌నివ్వ‌డంలేదు.

అందుకనే వారిలో పలువురు తిరిగి వైసిపిలోకి వెళిపోతే ఎలాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఆమధ్య కోడుమూరు ఫిరాయింపు ఎంఎల్ఏ మణిగాంధి చేసిన ప్రకటనే అందుకు సాక్ష్యం.

ఫిరాయింపు నేత‌లు తిరిగి వైసిపిలోకి వస్తే తీసుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం అందరకీ తెలిసిందే. దాన్ని అవకాశంగా తీసుకున్న ఫిరాయింపుల్లో పలువురు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో టచ్ లోకి వెళ్ళారట. ఈ విష‌యాన్ని బాబు చెవిన ప‌డేశారంట పార్టీ నేత‌లు.

రాజ్యసభ ఎన్నికల్లో జగన్ ను దెబ్బ కొట్టేందుకు వీలైనంతమందిని ఫిరాయింపులకు ప్రోత్సహించాలని ఒకవైపు ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ఊహించని రీతిలో ఫిరాయింపుల్లో కొందరు జగన్ అపాయిట్మెంట్ కోసం ట్రై చేస్తున్న విషయం బయటపడింది. జ‌గ‌న్ అపాయంట్‌మెంట్ ఇస్తే బాబుకు షాక్ త‌ప్ప‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -