Monday, April 29, 2024
- Advertisement -

ఈ ఏడాది డీఆర్​డీవో లక్ష్యం కేవలం అదే..!

- Advertisement -

ఎగుమతులే లక్ష్యంగా 2021లో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో) పనిచేయనున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్​ జి.సతీష్​ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు జరిగిన డీఆర్​డీవో 63 వ ఆవిర్భా వ దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్​నాథ్​ను కలిసి ఎగుమతులకు అనుమతి పొందిన ఆకాశ్​ క్షిపణి నమూనాను జ్ఞాపికగా అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్​, డైరెక్టర్​ జనరళ్లు, ఇతర డైరెక్టర్​లు మాజీ రాష్ట్రపతి డాక్టర్​ ఏపీజే అబ్దల్​ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

దేశ రక్షణ అవసరాలకు తగ్గట్టు ఆయుధాలు అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం 1958లో 10 ప్రయోగశాలలతో డీఆర్​డీవోని ఏర్పాటు చేసింది. గతేడాది తమ సంస్థ బహుళ విజయాలు సాధించినట్లు సతీష్​ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ప్రారంభమవుతున్న కొత్త సంవత్సరంలో మరిన్ని నూతన ఆవిష్కరణలతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. 2020లో ఎన్నో మైలురాళ్లను చేరుకున్నట్లు తెలిపారు. కొవిడ్​ను ఎదుర్కొనేందుకు తమ సంస్థ ఆధ్వర్యంలోని 40 ప్రయోగశాలల్లో దాదాపు 50కిపైగా సాంకేతిక పరిజ్ఞానాలు, 100కిపైగా ఉత్పత్తులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -