Thursday, May 2, 2024
- Advertisement -

లుకోస్కిన్​తో ఔరా అనిపించిన హేమంత్..!

- Advertisement -

సీనియర్ శాస్త్రవేత్త హేమంత్​ కుమార్​ పాండే రెండోసారి డీఆర్​డీఓ’సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ గ్రహీతగా నిలిచారు. ల్యూకోడెర్మా చికిత్స కోసం తయారు చేసిన ప్రసిద్ధ ఔషధమైన లుకోస్కిన్​తో సహా వివిధ మూలికా ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో హేమంత్​కు ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు ధ్రువపత్రం, రూ.2 లక్షల నగదు బహుమతిని అందించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్​ సింగ్​.

హేమంత్​ కుమార్​.. ఇప్పటివరకు ఆరు మూలికా ఔషధాలను అభివృద్ధి చేశారు. తాజాగా మూలికలతో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని దిల్లీలోని అమిల్​​ ఫార్మాస్యూటికల్స్​ ‘లుకోస్కిన్​’ పేరుతో యాంటీ-ల్యూకోడెర్మా ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. చర్మంపై తెల్ల మచ్చలు నివారించడానికి లుకోస్కిన్​ను ఉపయోగిస్తారు. ఈ ఔషధం మార్కెట్​లో విస్తృతంగా ప్రసిద్ధి చెందింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -