ఈడీ ని మోడీ వాడుకుంటున్నారా ?

ఈడీ ని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ వ్యూహాలలో భాగంగా వాడుకుంటున్నారా ? అంటే అవుననే సమాధానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధానిగా అధికారం చేపట్టిప్పటినుంచి ఇప్పటివరకు కూడా కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలపైనా లేదా బీజేపీ యేతర పార్టీల నేతలపైనే మని ల్యాండరింగ్ విభాగంలో ఈడీ కేసులు పెట్టడం గమనించవచ్చు. ప్రస్తుతం నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఇక అంతకు ముందు కూడా మహారాష్ట్రలో శివసేనపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో ఉద్దవ్ థాక్రే కు గట్టిగా మద్దతు పలికిన సంజయ్ రావత్ ను ఈడీ విచారణలో జైలు పాలు చేసింది కేంద్ర ప్రభుత్వం… అలాగే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల టైంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి కూడా విధితమే. అలాగే ఉత్తర ప్రదేశ్ లోని అఖిలేశ్ యాదవ్ సన్నిహితులు, మద్య ప్రదేశ్ లోని కమల్ నాథ్ సన్నిహితులు, అలాగే పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ కి చెందిన వారు.. ఇలా చెప్పుకుంటూ పోతే కేవలం ఎన్డీయే వ్యతిరేక పార్టీల నేతల పేర్ల లిస్ట్ మాత్రమే ఈడీ నుంచి కేసులు ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకొక ఆసక్తికర విసహ్యం ఏమిటంటే ఈ కేసులన్నీ కూడా కేవలం ఎన్నికల సమయంలోనే ఇతర పార్టీల నేతలు ఎదుర్కోవడం గమనార్హం.

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా 2019 ఎన్నికల ముందు టిడిపి కి చెందిన కొందరిపై ఈడీ విచారణ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఓవరాల్ గా ఎంఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) ను మోడీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసమే వినియోగించుకుంటున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇటీవల తెలంగాణలో కూడా కే‌సి‌ఆర్ ను ఉద్దేశించి టి‌ఎస్ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారి తీస్తున్నాయి. త్వరలోనే కే‌సి‌ఆర్ జైల్ కు వెళ్లబోతాడు అంటూ బండి సంజయ్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఏడాది తెలంగాణలో ఎన్నికల ముందు కే‌సి‌ఆర్ పై ఈడీ దాడులు జరిగిన ఆశ్చర్యం లేదనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. అదే గనుక నిజమైతే బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న పార్టీలపై మోడీ.. ఈడీ అస్త్రం వాడతారనే వార్తలకు మరింత బలం పెరుగుతుంది.

Also Read

చంద్రబాబుకు ఊహించని అవమానం

ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్.. ప్రత్యేకతలివే..!

జగన్ సార్.. మీ నవరత్నాలు ఇక మారరా ?

Related Articles

Most Populer

Recent Posts