జగన్ సార్.. మీ నవరత్నాలు ఇక మారరా ?

ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల కొరకు పని చేస్తూ..సమాజంలో ఎంతో హుందాగా, గౌరవంగా ఉంటూ.. రాబోయే తరానికి మార్గదర్శికంగా ఉండాలి.. కానీ ప్రస్తుతం ఏపీలోని అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను చూస్తే గౌరవానికి బదులు అసహ్యం వేసేలా ఉంది వారి వైఖరి. మహిళలను కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఎదుటి వ్యక్తికి కనీసపు గౌరవం కూడా ఇయ్యకుండా బండ బూతులు తిట్టడం.. మహిళలతో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడడం.. ఇవేనా సభ్యసమాజానికి మీరిచ్చే సందేశాలు అంటూ సామాన్య ప్రజలు అసహ్యించుకునే పరిస్థితికి వైసీపీ నేతలు చేరారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో అంబటి రాంబాబు ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోను ప్రజలు మర్చిపోక ముందే.. అవంతి శ్రీనివాస్ మరో మహిళతో అసభ్యంగా మాట్లాడినా మరో ఆడియో లీక్ నెట్టింట ఏ స్థాయిలో వైరల్ గా మారాయో మనందరం చూశాం. ఇవి మరవక ముందే మీకంటే నేనేం తక్కువ కాదు అన్నట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడినా వీడియో ఇటీవల బయటపడడం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా జాతీయ మీడియాలో సైతం గోరంట్ల మాధవ్ వీడియో గురించిన వార్తలు వస్తుండడంతో దేశ ప్రజల్లో కూడా వైసీపీ పై అసభ్యకర భావనా కలుగుతోంది. అధికార పార్టీ నేతలు ఇలా ఉండడం ఏంటి అని దేశ ప్రజలంతా కూడా వేలెత్తి చూపే పరిస్థితికి వైసీపీ దిగజారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి తమ పార్టీ నేతల బూతు పురాణాలు ఈ స్థాయిలో బయటపడుతున్నప్పటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. ” రాష్ట్రంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అని మీకు మీరు గొప్పలు చెప్పుకోవడం మాని ముందు మీ పార్టీ నేతలకు సమాజం పట్ల ఎలా మర్యాదగా వ్యవహరించాలో, నేర్పించండి జగన్ సార్ ” ప్రతి సామాన్య పౌరుడు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ఎన్నికల ముందు నవరత్నాలు అంటూ వైసీపీ అమలు చేసే పథకాలకు పేరు పెట్టుకున్న జగన్.. అదే పార్టీలో ఉన్న ఈ ఉమెనైజర్స్ నేతలకు ఏ పేరు పెడతారంటూ వైఎస్ జగన్ కు ప్రశ్నలు ఎదురౌతున్నాయి. మరి ఇప్పటికైనా వైఎస్ జగన్.. పార్టీని, పార్టీ నేతలను ప్రక్షాళన చేసే దిశగా నిర్ణయాలు తీసుకుంటాడో లేదో చూడాలి.

Also Read

టార్గెట్ రేవంత్ రెడ్డి.. కారణం ఆదేనా ?

మునుగోడు కంటే ముందే.. ముందస్తు ఎన్నికలా ?

ఆ మూడు బిల్లులు జగన్ కోసమేనా ?

Related Articles

Most Populer

Recent Posts