ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్.. ప్రత్యేకతలివే..!

ఎట్టకేలకు భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్ కర్ విజయం సాధించారు. విపక్షాల తరుపున కాంగ్రెస్ అభ్యర్థి మార్గరేట్ ఆళ్వా రేస్ లో ఉండగా ఆమెపై 346 ఓట్ల తేడాతో జగదీప్ గెలుపొందారు. ఆయనకు 528 ఓట్లు నమోదు కాగా మార్గరేట్ ఆళ్వా కు 182 ఓట్లు నమోదు అయ్యాయి. ఇక ఈ నెల 11వ తేదీన జగదీప్ భారత దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొదటి నుంచి కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ విజయం ఖాయమే అయినప్పటికి, అధికారికంగా ఎన్నికల్లో జగదీప్ విజయం సాధించడంతో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక జగదీప్ గతంలో 1989వ సంవత్సరంలో లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత కేంద్ర సహాయ మంత్రిగా కూడా పని చేశారు. 2019లో ఆయనను బీజేపీ ప్రభుత్వం బెంగాల్ గవర్నర్ గా నియమించింది. ఇక జగదీప్ ధన్ కర్ ఉపరాష్ట్రపతి పదవిలో రాజ్యసభ చైర్మెన్ గా వ్య్వాహరిస్తారు. ప్రస్తుతం మన దేశంలో ఉపరాష్ట్రపతి నెలవారి జీతం రూ.4 లక్షల వరకు ఉంది.

అంతే కాకుండా ఉపరాష్ట్రపతిగా ఉన్నవారికి దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యం, విమానాలు, రైళ్లలో ఉచిత ప్రయాణాలు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఉపరాష్ట్రపతిగా పదవి కాలం పూర్తి అయిన తరువాత వారికి లభించే జీతంలో 50 శాతం పింఛన్ రూపంలో లభిస్తుంది.

Related Articles

Most Populer

Recent Posts