Wednesday, April 24, 2024
- Advertisement -

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

- Advertisement -

ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కినప్పటి నుండి ప్రజలకు సుపరిపాలన అందించాలని నిరంతరం జగన్ ప్రయత్నిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎంగా తాను ఏంటో 100 రోజుల పాలనలో నిరూపించుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తానని మాట ఇచ్చిన జగన్ ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు చేస్తు ఆమాటను నిలబెట్టుకుంటున్నారు.

తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం జగన్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసినప్పుడు చర్చించారని సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుకు రూ.1300 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులలో ఇది ప్రభుత్వంపై భారంగా మారుతుంది. అయితే ఇచ్చిన హామీ నిరవెర్చేందుకు జగన్ కొత్తపాన్ సిద్దం చేసుకుంటున్నటు సమాచారం.

ఇప్పడున్న 13 జిల్లాలను 29 జిల్లాల్నిఏర్పాటు చేయాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీకేంద్రీకరించటం ద్వారా వీలైనంత ఎక్కువగా జిల్లాలను అభివృద్ది చేయాలని.. ఇలా అయితే ఎంతో కొంత కొత్త జిల్లాల ఏర్పాటుకు అయ్యే ఖర్చును తగ్గించవచ్చానే ఆలోచనలో జగన్ ఉన్నాట్లు తెలుస్తుంది.

అలాగే అందుబాటులో ఉన్న వనరుల్ని ఉపయోగించుకోని.. ప్రస్తుతానికి అద్దె భవనాల్లో ఏర్పాట్లు చేసి.. కొత్త భవనాల నిర్మాణాన్ని జోలికి వెల్లకుండా.. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా ప్లాన్ చేశారు. మరోవైపు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటు… ఆర్థిక ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకొని.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

గవర్నర్ తో జగన్ భేటీ.. మతలబ్ ఎంటీ..?

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

వారి కొసం జగన్ వ్యూహం ఎంటి..?

ప్రజలకు మాటిచ్చిన జగన్.. అస్సలు మాట తప్పడట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -