- Advertisement -

ఎక్స్‌ట్రా చేస్తే తాటతీస్తా……. ప్రజలపై బాలయ్య పెతాపం

- Advertisement -

అదేదో సినిమాలో ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది. రాజకీయాల్లోకి ఎందుకు వద్దామనుకుంటున్నావయ్యా అంటే ‘కసి… పెజాసేవ చేయాలన్న కసి’ అని సదరు నాయకుడు డైలాగ్ కొడతాడు. ఇఫ్పుడు టిడిపి నేతల తీరు కూడా అలాగే ఉందేమో అనిపిస్తోంది. అది కూడా దళితులపై కసి చూపిస్తున్నారు. తాజాగానే అనంతపురంలో టిడిపిలో ప్రముఖ స్థానంలో ఉన్న ఒక నాయకుడి పిఎ అవసరం కోసం వచ్చిన ఒక మహిళ తనతో గెస్ట్ హౌస్‌కి రావడానికి ఒప్పుకుంటుందా లేదా అని చెప్పి ఆమెతో వచ్చినవాళ్ళతోనే ఆరా తీయడం సంచలనం రేపింది. భర్తలేని ఒక మహిళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే టిడిపి నేతలు స్పందించిన తీరు అది.

ఇక ఎస్సీలలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు? చదువుకోరు అనే రేంజ్‌లో చంద్రబాబు, వర్ల రామయ్య ఇంకా తదితర నేతలు రెచ్చిపోయిన వైనం మనకు తెలుసు. అలాగే రమణదీక్షితులును నాలుగు తంతే అంటూ మాట్లాడిన సోమిరెడ్డి అధికార అహంకారం కూడా తెలుసు.

ఇప్పుడిక బాలయ్య వంతు వచ్చింది. ఆ మధ్య మహిళల గురించి నీచంగా మాట్లాడిన బాలయ్య ఈ సారి దళితులపై రెచ్చిపోయాడు. తనకు దండ వేయడానికి వచ్చిన ఒక దళిత యువకుడితో ఎక్స్‌ట్రా చేస్తే తాట తీస్తా అని మాట్లాడి ఆ తర్వాత అందరికీ అదే వర్తిస్తుంది అనే రేంజ్‌లో మాట్లాడేశాడు. టిడిపి గెలుపు కోసం నానా కష్టాలు పడ్డామని, అయినప్పటికీ మా సమస్యల గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదని అన్న ప్రజలతో ‘అన్నీ నాకు తెలుసు……… ఎక్స్‌ట్రా చేస్తే తాట తీస్తా‌ అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. మామూలుగానే సంవత్సరానికి ఒకసారి గెస్ట్‌లా నియోజకవర్గానికి వచ్చే బాలయ్య …….. ఆ వచ్చిన ఒకటి రెండు సందర్భాల్లో కూడా కనీసం ప్రజల సమస్యలు వినడానికి కూడా ఆసక్తి చూపించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ టిడిపి స్థానిక నాయకులతో సహా ఎవ్వరూ కూడా ప్రజల గోడు పట్టించుకోకుండా బాలయ్య ముందు షో చే్స్తూ ఆ ప్రజలను పక్కకు నెట్టివేయడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. ఏడాదిలోనే ఎన్నికలున్న నేపథ్యంలో ప్రజలతో ఇంత పరుషంగా మాట్లాడడం వెనకాల టిడిపి నాయకుల ధైర్యం ఏంటి అని కొంతమంది ఆ సభా ప్రాంగణంలోనే చర్చించుకోవడం కనిపించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -