Sunday, May 19, 2024
- Advertisement -

పాపంలో భాగ‌స్వాములంకాలేం…అఖిల‌ప‌క్షానికి వైసీపీ, జ‌న‌సేనలు దూరం..

- Advertisement -

చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల‌యిన వైఎస్సార్సిపి, జనసేన పార్టీలు ఈ స‌మావేశానికి దూరంగా ఉన్నాయి. ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి, విభజన చట్టం అమలులో కేంద్ర వైఖరిని వైసిపి ఎప్పటి నుండో నిరసిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ వైసిపితో పాటు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు.

చంద్రబాబుతో మేం పాఠాలు చెప్పించుకోవాలా అని వైసీపీ మండిపడగా.. అఖిలపక్ష సమావేశాన్ని రాజకీయ ఎత్తుగడగా జనసేన అభివర్ణించింది. ఈ భేటికి ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందో.. ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఏ పనికైనా సంకల్పం బలంగా ఉంటే ఫలితం గొప్పగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. కానీ బాబు తలపెట్టిన అఖిలపక్ష సమావేశంలో సంకల్పం లోపించిందని జనసేన మండిపడింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -