Saturday, May 4, 2024
- Advertisement -

బాబు మల్టీప్లెక్స్ బ్రెయిన్ దుష్ట‌ రాజ‌కీయ వ్యూహానికి జూ ఎన్టీఆర్ బ్రేక్‌..?

- Advertisement -

చాణక్యడు భారతదేశాన్ని ఏకీకృతం చేసేందుకు, ఏకీకృత భారత్ కు పటిష్టమైన సమర్ధవంత మైన పరిపాలన అందించటానికి మాత్రమే వ్యూహాలు పన్ని జాతిని యవన దండయాత్రలను ఎదుర్కొనేలా తీర్చిదిద్దాడు. చాణుక్యుడు ఆర్థ‌శాస్త్రం సృష్టించినా, అంతా దేశం కోసమే చేశారు కాని తన స్వప్రయోజనాలకు మాత్రం కాదు. కాని చాణుక్య‌ని అంత రాజ‌కీయం క‌లిగిన బాబు మాత్రం త‌న స్వార్థ రాజ‌కీయాల కోసం , రాష్ట్ర ప్రయోజనాలు మరచి స్వ కుటుంబ, స్వజన, స్వకుల, స్వమిత్రజన, స్వపరిజన సేవే పరమావధిగా జీవితంగా బ్రతికేస్తున్నారు.

త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోసం వాడ‌కం మొద‌లు పెడితే బాబు త‌ర్వాతే ఎవ‌రైనా చెప్ప‌వ‌చ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయంగా వాడుకొని వారిని వ‌దిలేయ‌డం బాబుకు వెన్నుతో పెట్టిన విద్యే. ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అన్నట్టు వుండే..అమాయక నందమూరి ఫామిలీని లెక్కకు మిక్కిలిగా వాడేశారు చంద్రబాబు.

ఇప్పుడు కూకటపల్లి నియోజక వర్గంలో నందమూరి సుహాసినిని శాసనసభ స్థానానికి అభ్యర్ధిగా నారా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయటంలోని అర్ధాలు, పరమార్ధాలు ఏంటో అంద‌రికి తెలుసు. సుహాసినిని బ‌రిలోకి దింపు మ‌రో సారి యూజ్ అండ్ త్రో సిరీస్ లో కొత్త ఎపిసోడ్ మొదలు పెట్టాడు బాబు.

చంద్రబాబుది మామూలు బ్రెయిన్ కాదు మల్టీప్లెక్స్ బ్రెయిన్..ఆయన బుర్రలో ఒకేసారి నాలుగు సినిమాలు న‌డుస్తుంటాయి. హరికృష్ణ ఫామిలీని ఆదరిస్తున్నట్టు పైకి పోస్టర్ వేసి..ఆయన రచించిన వ్యూహం వెనక ప్రయోజనాలు ఏంటో తెలిస్తే ఎవ‌రైనా ముక్కున వేలు వేసుకుంటారు.

ఇలాంటి తెలివి తేటల విషయంలో చంద్రబాబుకు తిరుగులేదు. ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు. అసలు ఎవరూ ఊహించని రీతిలో చంద్ర బాబు నిర్ణయాలు తీసు కొంటూ ఉంటాడు. మొన్నటి వరకూ హరికృష్ణకు కూతురుంది అనే విషయం తెలిసింది చాలా తక్కువ మందికే. అయితే నందమూరి కుటుంబాన్ని రాజకీయాల్లో ఉంచడం చంద్రబాబు కు పెద్దగా ఆమోదయోగ్యం కాదు అందునా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఉంచడం అస్సలు ఇష్టం ఉండదు.

కారణం అక్కడ నందమూరి ‘వంశాంకురం’ రాజకీయాల్లో ఉంటే తన ‘వంశాంకురం నారా లోకెష్ నాయుడు’ కు భష్యత్ రాజకీయాల్లో అడ్దువస్తారేమోనని భయం బాబుకు ప‌ట్టుకుంది. ఎందుకంటే లోకేష్‌కు పార్టీనీ న‌డిపించే ల‌క్ష‌ణాలు ఒక్క‌టి లేవ‌న్న‌ది అద‌రికీ తెలిసిందే.

జూనియ‌ర్ ఎన్టీఆర్ అంటే బాబు ప‌క్క‌ త‌డుపేసుకుంటాడు. అందుకే ఏపీలో వేలు పెట్ట‌కుండా తెలంగాణకే పరిమితం చేసైనా వారిని తెలంగాణా రాజకీయరంగంలోకి దించు తున్నాడు. అది కూడా ఆడవాళ్లకు అవకాశం ఇస్తుండటం విశేషం. వాళ్లైతే అంత త్వరగా ఎదురు తిరగలేరు. అందులోనూ హ‌రికఋష్ణ కూత‌రు రాజ‌కీయాల‌కు కొత్త‌. ఎద‌గాలంటే చాలాటైమ్ ప‌డుతోంది.

అలాగే ఇప్పుడు ఆమెను గెలిపించుకునే బాధ్యతను సైతం వ్యూహాత్మకంగా సోదరీ సోదరుల అనుబంధం అనే సెంటిమెంట్ ప్రయోగించిన చంద్రబాబు నాయుడు హరి తనయులైన కళ్యాణ్ – జూనియర్ ఎన్ టి ఆర్ ల మీద పెట్టేస్తాడు. ఎందుకంటే చెల్లి త‌రుపున ప్ర‌చారం చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయి.

ఎలాగూ నందమూరి హరికృష్ణ కారు ప్రమా దంలో హృదయవిదారకంగా మరణించిన సానుభూతి ఉంటుంది కాబట్టి, ఆమె విజయం కూడా నల్లేరు మీద నడకలా సాగ వచ్చు సాధ్యపడవచ్చు. ఎమ్మెల్యేగా ఆమెకు అవకాశం ఇచ్చిన పేరు తనకు దక్కుతుంది. నందమూరి కుటుంబాన్ని దూరం పెట్టాడన్న అపప్రద పోతుందన్నది చంద్రబాబు ఆలోచన కావొచ్చు.

గెలుపు కష్టమైనా జూనియర్ ఎన్ టి ఆర్ కళ్యాణ్ రాం బాలకృష్ణలు ప్రచారం చేసైనా గెలిపిస్తారు అన్న ధీమా. అదే వేరెవరికైనా అంటే జూనియర్ ఎన్ టి ఆర్ ప్రచారానికి సున్నితంగా తిరస్కరించవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూనియర్ లేకుండా కూకట్‌పల్లిలో ఆమె గెలుపు అంత తేలికకాదు.

బాబు గారి దురాలోచనలు చూస్తే ఎవ‌రైనా షాక్ అవ్వాల్సిందే. నంద‌మూరి కుటుంబంపై అంత ప్రేమే ఉంట హరికృష్ణ సొంతూరు నిమ్మకూరు వున్న గుడివాడ స్థానంలోనో..ఆయన గతంలో పోటీచేసిన హిందూపూర్ లోనో నిలబెట్టాల్సిన వాళ్లను కూకట్ పల్లిలో పోటీలోకి నిల‌ప‌డం అంటే బాబు రాజ‌కీయ వ్యూహం అర్థం చేసుకోవ‌చ్చు.

హరికృష్ణ కుటుంబానికి …చంద్రబాబుకు చాలాకాలం నుంచి సత్సంబంధాలు లేవన్నది బహిరంగ రహస్యమే…గతంలో మహానాడు సందర్భంలో జూ. ఎన్టీఆర్ ఫోటోలు పెట్టొద్దని లోకేశ్ ఆదేశాలు ఇవ్వడం త‌ర్వాత జ‌రిగిన రాద్దాంతం తెలిసిందే. జూ. ఎన్టీఆర్ నందమూరి ఫామిలీలో అందరికంటే తెలివైనవాడు..చంద్రబాబు ఉచ్చులో చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నవాడు. చంద్రబాబు తర్వాత .. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఆయన చేతిలోకే వెళుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కమ్మ సామాజిక వర్గం ఓటర్లు, సీమాంధ్ర ఓట్లు, వీటన్నిటికీ మించి నందమూరి అభిమానులే కూకటపల్లిలో టీడీపీని గెలిపించేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. అయితే బాబుకు నంద‌మూర కుటుంబం ఒక ర‌కంగా షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి. ఎందుకంటే త‌మ చెల్లిని గెలిపించాల‌ని క‌ళ్యాణ్ రామ్‌, ఎన్టీఆర్‌లు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇందులో ఎక్క‌డా కూడా బాబు పేరును లేకుండా చూసుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -