Monday, May 13, 2024
- Advertisement -

రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం…నోటీసులు జారీ

- Advertisement -

తెలంగాణాలో ఒక ప‌క్క ఎన్నిక‌ల వేడి..మ‌రో ప‌క్క ప్ర‌తిప‌క్ష పార్టీ ముఖ్య‌నాయ‌కుల  అరెస్టుల‌తో మ‌రింత ఎన్నిక‌ల వేడి రాజుకుంది. ఇ్ప‌ప‌టికే కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి మ‌నుసుల అక్ర‌మ‌ర‌వాణా కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా అదే పార్టీకీ చెందిన ముఖ్య‌నేత రేవంత్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధ‌మ‌య్యింది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో అవకతవకల కేసులో రేవంత్‌రెడ్డికి ఈ నోటీసులు జారీ చేశారు పోలీసులు. 41 సీఆర్సీసీ కింద నోటీసులు జారీ అయ్యాయి. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాలు కేటాయించారనే విషయమై రేవంత్‌ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. 2001 జూబ్లీహిల్స్ హౌసింగ్ సోసైటీ కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసులపై 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రేవంత్ ను పోలీసులు కోరారు. అయితే ఈ విషయమై రేవంత్ రెడ్డి పోలీసులకు సమాధానమిచ్చారు.ఎన్నికల బిజీలో ఉన్నందున తాను హాజరుకాలేనని రేవంత్ రెడ్డి పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ కేసు విషయమై రేవంత్ రెడ్డితో పాటు మరో 13 మందికి కూడ జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

పాస్‌పోర్ట్ కేసులో జగ్గారెడ్డిని మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. తాజాగా రేవంత్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, రేవంత్ కు నోటీసులు అందడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -