Tuesday, April 30, 2024
- Advertisement -

రేవంత్ గేమ్ షురూ..జగ్గారెడ్డి ఔట్!

- Advertisement -

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించారు రేవంత్ రెడ్డి. అయితే పీసీసీ అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం మొదలు పెట్టింది నుండి సీఎంగా ఎంపిక అయ్యే వరకు కొంతమంది సీనియర్లు ఆయనకు పక్కలో బల్లెంలాగే తయారయ్యారు. ముఖ్యంగా జగ్గారెడ్డి…రేవంత్ టార్గెట్‌గా ఔట్ రైట్‌గా విమర్శలు చేశారు. ఓ దశలో వ్యక్తిగతంగానూ రేవంత్‌పై మండిపడిన సందర్భాలు అనేకం.

ఇక సీన్ కట్ చేస్తే జగ్గారెడ్డి తనకు కంచుకోట అయిన సంగారెడ్డి నుండి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ గాలిలో ఆయన ఓడిపోవడం ఇబ్బందికరంగా మారింది. అయితే
ఓడినా తనకు ఎమ్మెల్సీ తద్వారా మంత్రి పదవి వస్తుందని ఆశీంచారు. కానీ రేవంత్ పెట్టిన చెక్‌తో జగ్గారెడ్డి ఓ నాయకుడిగానే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మంత్రి పదవులు, నామినేటెడ్, ఎమ్మెల్సీ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఫస్ట్ టైం గెలిచిన వారికి, ఓడిపోయిన వారికి అవకాశం ఇవ్వొద్దని రేవంత్‌ రెడ్డికి ఏఐసీసీ నాయకులు క్లీయర్‌గా చెప్పారట. నిర్ణయం ఏఐసీసీదే అయినా రేవంత్‌ చెప్పడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చని కొంతమంది కాంగ్రెస్ నేతలే చెబుతున్న పరిస్థితి నెలకొంది.

ఒక జగ్గారెడ్డే కాదు ఓడిపోయిన సీనియర్లకు ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే ఓడిపోయిన వారిలో కొంతమంది సీనియర్లు రేవంత్‌కు అనుకూలంగా ఉన్నారు. ప్రధానంగా షబ్బీర్ అలీ. నిజామాబాద్ అర్బన్ నుండి పోటీచేసిన షబ్బీర్ ఓటమి పాలయ్యారు. అయితే తాను మంత్రి కావడం ఖాయమనే ధీమాలో ఉన్నారు షబ్బీర్. మరి రేవంత్ నిర్ణయం ఎలా ఉండనుంది..?కేవలం జగ్గారెడ్డినే టార్గెట్ చేస్తాడా అన్నది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -