Friday, May 3, 2024
- Advertisement -

గుంటూరు జిల్లాలో వైసీపీ బూస్ట్‌…

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డేకొద్దీ ప్ర‌తిప‌క్ష‌పార్టీ వైసీపీ బ‌లం పుంజుకుంటోంది. ఒక వైపు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్‌కు వ‌స్తున్న స్పంద‌న‌….మ‌రో వైపు ప్ర‌త్యేక‌హోదాపై చేస్తున్న పోరాటంతో ప్ర‌జ‌ల్లో మంచి మైలేజ్ వ‌స్తుండ‌టంతో సీనియ‌ర్‌నేత‌లు వైసీపీలోకి వ‌చ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

తాజాగా భాజాపా సీనియ‌ర్‌నేత‌, మాజీ మంత్రి క‌న్నాల‌క్షీనారాయ‌ణ వైసీపీలో చేరునున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కన్నాతో మంతనాలు జరుపుతున్నారట. అన్నీ సానుకూలమైతే గుంటూరు జిల్లాలోకి జగన్ ప్రవేశించేనాటికి కన్నా పార్టీలో చేరికపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాల సమాచారం.

గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నుండి నాలుగు సార్లు గెలిచారు. తర్వాత గుంటూరు వెస్ట్ నుండి ఒకసారి గెలిచినా రెండోసారి ఓడిపోయారు. రాష్ట్ర విభజన వల్ల దెబ్బతిన్న అనేకమంది సీనియర్ నేతల్లో కన్నా కూడా ఒకరు. 2014 ఎన్నికల తర్వాత కన్నా మెల్లిగా బిజెపిలో చేరారు. అయితే భాజాపాలో ఆయ‌న‌ను ప‌ట్టించుకొనే వారులేరు. దాంతో గ‌త కొంత‌కాలంగా తీవ్రంగా మ‌ద‌న‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

టీడీపీలోకి వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఇక మిగిలింది వైసీపీనే. అందులోనూ వైసిపికి కూడా గుంటూరు జిల్లాలో సీనియర్ నేతల అవసరం ఎటూ అవసరమే. దాంతో అటు జగన్ ఇటు కన్నాకు కావాల్సిన కాపు నేతలు కొందరు మధ్యవర్తిత్వం నెరుపుతున్నారట. పార్టీలోకి కన్నాను తీసుకోవటానికి జగన్ కూడా సుముఖంగానే ఉన్నారట.

కన్నా గతంలో పోటీ చేసిన పెదకూరపాడైనా ఓకే లేకపోతే గుంటూరు వెస్ట్ అయినా పర్వాలేదని జగన్ ఓకే చెప్పారట. అయితే రెండుసీట్లు కావాల‌ని క‌న్నా కోరిన‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ అంగీక‌రిస్తారా అన్న‌ది చూడాల్సిఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -