మళ్లీ పూజలలో కి కేసిఆర్.. హల్దీవాగులోకి కొత్త నీరు..!

- Advertisement -

ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొండపోచమ్మ జలాశయం వద్ద సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అనంతరం కొండపోచమ్మ నుంచి హల్దీవాగులోకి నీటిని విడుదల చేశారు. జలాశయం నుంచి హల్దీవాగులోకి గోదావరి జలాలు పారుతున్నాయి.

హల్దీవాగు ద్వారా 14,268 ఎకరాలకు సాగునీరు అందనుంది. వర్గల్, తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం రైతులకు లబ్ధి చేకూరనుంది. హల్దీవాగు జలాల ద్వారా మెదక్, హవేలీ ఘనపూర్ రైతులు లబ్ధి పొందనున్నారు. అవుసులోనిపల్లి నుంచి వర్గల్‌ బంధం చెరువుకు నీరు చేరనుంది.

- Advertisement -

అవుసులోనిపల్లి పెద్దచెరువు నుంచి శాకారం ధర్మాయ చెరువుకు నీరు పారనుంది.అంబర్‌పేటలోని ఖాన్‌చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా ప్రవహిస్తుంది. ఖాన్‌చెరువు నుంచి హల్దీవాగులోకి గోదావరి జలాలు పారుతాయి. హల్దీ నుంచి మంజీరాలో ప్రయాణించి నిజాంసాగర్‌కు జలాలు పరుగులు పెడతాయి.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -