- Advertisement -

రిమాండ్ రిపోర్టులో లోకేష్ పేరు!

- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు అరెస్ట్‌ కు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలను పేర్కొంది సీఐడీ. ఈ మొత్తం వ్యవహారంలో కుట్రదారు చంద్రబాబేనని ఆయనకు తెలిసే అంతా జరిగిందని సీఐడీ వెల్లడించింది. అలాగే ఇక ప్రధారంగా రిమాండ్ రిపోర్టులో లో లోకేష్ పేరు ప్రస్తావించింది సీఐడీ. చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా వివరాలు వెల్లడించిన సందర్భంలోనూ లోకేష్‌ను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని తెలిపారు అధికారులు. అమరావతి ఇన్నర్ రిండ్ రోడ్డు మళ్లింపు, ఏపీ ఫైబర్ నెట్‌లో జరిగిన అవకతవకల్లో లోకేష్ పాత్ర ఉందని ఆయన్ని కూడా ప్రశ్నిస్తామని చెప్పినట్లుగానే రిమాండ్ రిపోర్టులో ఇదే అంశాన్ని ప్రస్తావించారు సీఐడీ అధికారులు.

కిలారీ రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని…అలాగే చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ముడుపులు ముట్టాయని వెల్లడించింది. ఇక కుంభకోణంపై ఈడీ విచారణ జరుపుతోందని…ఇప్పటికే పలువురి అరెస్ట్ చేసిందని పేర్కొంది. ఈడీ విచారణ కీలక దశలో ఉందని పేర్కొంది…ప్రధానంగా వాంగ్మూలం ఇచ్చిన మనోజ్, శ్రీనివాస్‌ తమ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా విదేశాలకు పారిపోయారని తెలిపింది. బాబే వీరిని కాపాడుతున్నారని…బాబును కాపాడేందుకే ఇదంతా వీరు చేస్తున్నారని వెల్లడించింది.

దీంతో చంద్రబాబు ముందు ఉన్న దారులన్నీ క్లోజ్ కాగా ఇక లోకేష్ వంతు వచ్చేసింది. త్వరలోనే లోకేష్‌ని కూడా అరెస్ట్ చేసి ఆయన్ని విచారించనున్నారు సీఐడీ అధికారులు. ఇక జరుగుతున్న పరిణామాలు అన్ని టీడీపీ,బాబు అండ్ కోకి వ్యతిరేకంగా ఉండటంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -