Sunday, May 5, 2024
- Advertisement -

నిర్మాణాలపై మంత్రి హరీష్ రావు కామెంట్స్.. అన్ని లెక్కలే..!

- Advertisement -

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి హరీశ్​రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భానికి ముందు 693 కిలోమీటర్లు మాత్రమే డబుల్ లైన్ రోడ్లు ఉన్నాయని… ఆరేళ్లలో 7,180 కిలోమీటర్ల మేర డబుల్ లైన్ రోడ్లు నిర్మించామని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రస్తుతం 1,029 కి.మీ. నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయని స్పష్టం చేశారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 432 బ్రిడ్జిలు నిర్మించినట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో పెద్దఎత్తున రోడ్లు, వంతెనలు నిర్మించినట్లు తెలిపారు.

తాగునీటిపై జాతీయ సగటు కంటే ఎక్కువగా ఖర్చు చేశామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. గడపగడపకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నట్లు కేంద్రం కూడా ప్రశంసించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని హరీశ్​రావు తెలిపారు. వ్యవసాయ రంగంపై జాతీయ సగటు వ్యయం 6.4 శాతం ఉండగా… రాష్ట్రంలో 11.4 శాతం ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.

దూకుడు పెంచిన ప్రియమణి

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం

బుల్లితెరపై అదరగొట్టబోతున్న విజయ్ సేతుపతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -