Saturday, May 11, 2024
- Advertisement -

ఆందోళ‌న‌లో వైసీపీ.. ఫ‌లితాలు టీడీపీ వైపె మొగ్గు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ చిన్న సంఘ‌ట‌న‌లు త‌ప్ప ప్ర‌శాంతంగా ముగిసింది. ఎన్నిక‌లో డ‌బ్బుపంపిణీ, మ‌ద్యం ఏరులై పారింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. గెలుపు ఎవ‌ర‌నేదానిపై ఇప్పుడు ఇరు పార్టీల్లో ఉత్కంఠ నెల‌కొంది. పైకి మాదంటె.. మావె ఇజ‌యం అని చెప్పుకుంటున్నా లోప‌ల మాత్రం ఆందోళ చెందుతున్నారు. స‌రైన ప్రాధాన్యంలేని ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌కి వ‌చ్చే ఓట్లే నంద్యాల ఫ‌లితాన్ని తారుమారు చేయ‌బోతున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు.

ఇద్ద‌రిలో కాంగ్రెస్ అభ్య‌ర్తి కాంగ్రెస్ అభ్య‌ర్తి అభ్యర్థి అబ్దుల్ ఖాదర్, మరొకరు రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థి పుల్లయ్య. నంద్యాల‌లో ఎక్కువ‌గా ముస్లిం ఓట్లే కీల‌కంగా మారాయి. ఈ ఓట్ల‌కోసం వైసీపీ, టీడీపీ చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. పోలింగ్‌కి మూడు రోజుల ముందు రిపబ్లిక్ టీవీ వెబ్ సైట్ లో జగన్ బిజెపి గూటికి చేరుతున్నార‌న్న వార్త వైసీపీ కొంప‌ముంచే విధంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్‌కి ప‌డ‌టంతో వైసీపీకి మైన‌స్ అవుతుంది. కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్ని ముస్లిం ఓట్లు వస్తాయి అనేది వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి విజయం పై ప్రభావం చూపుతుంది.

ఇక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోని రాయలసీమ పరిరక్షణ సమితి ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపింది. రాయలసీమ కు అన్యాయం జరుగుతోందని, వివక్షకు గురవుతోంది అనే వాదనతో పోటీ చేసిన పుల్లయ్య కు ఎన్ని ఓట్లు వస్తాయనేది కీలకం. పుల్లయ్యకు ఎక్కువ ఓట్లు వస్తే అది వైకాపా కు నష్టం. తెదేపా, వైకాపా ల మధ్య పోటాపోటీగా జరిగిన నంద్యాల ఎన్నికలో ప్రతి ఓటూ కీలకం. ఖాదర్, పుల్లయ్యలు ఎన్ని ఓట్లు చీల్చుతారు అనేది గెలుపు ఓటములని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

పోలింగ్‌కు ముందు విజ‌యంపై వైసీపీ ధీమాగా ఉన్నా… ఆ త‌ర్వాత వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. గెలుపు టీడీపీకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. పోలింగ్ శాతం ఎక్కువ పెర‌గ‌డం కూడా అధికార‌పార్టీకె క‌ల‌సి వ‌స్తుందంటున్నారు విశ్లేష‌కులు. దీంతో వైసీపీ తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -