Saturday, May 18, 2024
- Advertisement -

నంద్యాల సెగ లోకేష్ కూ బాగానే తగిలింది

- Advertisement -

ఏపీ ఐటీ మంత్రి లోకేష్ రాజ‌కీయ ప‌రిజ్ణానం ఏపాటిదో ఇప్ప‌టికే ప్ర‌జ‌లంద‌రికి తెలుసు.గూగుల్‌లో ప‌ప్పు అని టైప్ చేస్తె చాలు మంత్రి పోటోనె ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాది.అంత‌టి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు.అయితి ఇప్పుడు తాజాగా ఈ శతాబ్ద‌పు మిలీనియం జోక్‌ను పేల్చారు.

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపి 140 అసెంబ్లీ స్ధానాల్లో విజయం సాధిస్తుంద‌ని … నారా లోకేష్ ధీమా వ్య‌క్తం చేశారు. 2019లో భాజపా, జనసేనతో కలిసే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. ఆమాత్రం న‌మ్మ‌కం ఉండాలి ..కాని లోకేష్ చెప్పిన మాటలు కాస్త వినటానికి అతిగా ఉంది.

వచ్చే ఎన్నికల్లో టిడిపికి నిజంగానే 140 సీట్లు వచ్చే పరిస్ధితే ఉంటే ఇపుడు నంద్యాల ఉపఎన్నికల్లో చేస్తున్న గోలంతా ఎందుకు. ఒక ఉపఎన్నికలో అదికూడా ఫిరాయింపు నియోజకవర్గంలో గెలవటానికి ఎన్ని అవస్తలు పడుతున్నదో అందరూ చూస్తున్నదే. గ్రామస్తులకు సమాధానం చెప్పుకోలేక దబాయించి వాళ్ళ నోళ్ళు మూయిస్తున్న వైనమూ అందరూ చూసిందే.

ఈ పరిస్ధితి ఒక్క నంద్యాలలోనే కాదు దాదాపు అన్నీ నియోజకవర్గాల్లోనూ ఉంది. ఏదో ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మరణం వల్ల నంద్యాలలో ఎన్నిక అనివార్యమైంది కాబట్టి జనాల స్పందన బయటపడుతోంది. ఆ విషయం తెలుసే కదా ఫిరాయింపులతో రాజీనామాలు చేయించకుండా నెట్టుకుస్తున్నది? నంద్యాల సెగ లోకేష్ కూ బాగానే తగిలింది.

రాష్ట్రపతి ఎన్నకల్లో వైసీపీ, భాజపాకు మద్దతివ్వటాన్ని ఇంకా జీర్ణించుకోలేకున్నారు లోకేష్. పోయిన ఎన్నికల్లో టిడిపి కూటమి-వైసీపీకి వచ్చిన 5 లక్షల ఓట్ల తేడా గురించి మాట్లాడుతూ, అసలు ఏ లెక్కన తేడా 5 లక్షలే అని ఎదురుప్రశ్నించి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. టిడిపికి కొన్ని నియజకవర్గాల్లో 40 వేల మెజారిటీ కూడా వచ్చిందన్నారు. పైగా వైసీపీకి కడప, కర్నూలులో మాత్రమే మెజారిటీ సీట్లు వచ్చాయని చెప్పటం విచిత్రంగా ఉంది.చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో వైసీపీ 8 సీట్లు గెలుచుకున్న విషయం లోకేష్ మరచిపోయినట్లున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -