ఏపీసీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ సినిమా చూపిస్తున్నారు.సీట్లు పెరుగుతాయని పిరాయింపులను ప్రోత్సహించిన బాబుకు దిమ్మతిరగి బొమ్మకనిపిస్తోంది.కర్నూలు జిల్లాలో పేరున్న తెలుగుదేశం పార్టీ నేత శిల్పా బ్రదర్స్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇది ఇంతటితో ఆగేలా కనిపించడంలేదు.తుఫానులా టీడీపీని విచ్చిన్నంచేసెవరకు ఆగదు.
ఇప్పుడు తాజాగా శిల్పా బ్రదర్స్ బాటలో నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ నేతలు ఆనం బ్రదర్స్ కూడా వైసీపీ కండువా కప్పుకోవడానికి చూస్తున్నారన్న వార్తలు వైరల్గా మారుతున్నాయి.వారిని బుజ్జగించేందుకు స్వయంగా సీఎం నారా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తమకు పార్టీలో సరైన ప్రాతినిథ్యం కల్పించలేదని, ఇస్తామన్న ఎమ్మెల్సీ సీట్లను కూడా ఇవ్వలేదని గత కొంత కాలంగా ఆనం సోదర ద్వయం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక వారిని పార్టీలోనే ఉంచేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు, ఆనం రామరనారాయణరెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
బాబు ఇచ్చిన ఆఫర్ను ఆనం సోదరులు తిరస్కరించినట్లు తెలుస్తోంది.తనకు అధ్యక్ష పదవి వద్దని, ఎమ్మెల్సీ, మంత్రి పదవి కావాలని ఆనం బ్రదర్స్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోకుంటే, పార్టీని వీడటం ఖాయంగా తెలుస్తోంది.
