Monday, May 13, 2024
- Advertisement -

దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు…లోకేష్‌కు నెట‌జ‌న్ల స‌వాల్‌

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడి పుత్ర ర‌త్నం, ఐటీ మంత్రి నారాలోకేష్ రాజ‌కీయ ప‌రిజ్ణానం గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఇప్ప‌టికే ఆయ‌న‌కు నెట‌జ‌న్లు పప్పు అని బిరుదు ఇచ్చారు. అయితే కొద్ది రోజులుగా మీడియాముందుకు లోకేష్ రావ‌డంలేదు. ఓన్లీ ట్విట్ట‌ర్‌లోనే ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. ఐటీ గ్రిడ్ వ్య‌వ‌హారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతుంటే ఐటీ మంత్రిగా ఉన్న నారాలోకేష్ క‌నీసం మీడియా ముందుకు వ‌చ్చ వివ‌ర‌ణ ఇవ్వ‌లేదు. ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సి బాధ్య‌త ఒక మంత్రిగా లోకేష్ మీద ఉంది.

త‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చినా లేకా ఎవరినైనా విమర్శించాల్సి వచ్చినా కూడా ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నారు. బాబుగారి భజన మీడియా కూడా ట్విట్టర్ లో అయ్యగారు పెట్టిన పోస్టింగ్ లను కాపీ చేసుకుని వాటినే అపురూపంగా టీవీల్లో, పేపర్లలో చూపించుకుంటున్నాయి. అయితే ట్వీట్ల‌తోనే స‌రిపెడుతున్న మంత్రిగారిని ఎల్లో మీడియా పైకి లేపుతున్నా నెటిజ‌న్లు మాత్రం సోష‌ల్ మీడియాలో చెడుగుడు ఆడుకుంటున్నారు.

ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ తొలి దశ.. ఎప్రిల్‌ 11నే జరగనుంది. ఈ సంద‌ర్భంగా నారాలోకేష్ వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌డంతో బాబు అమ‌రావ‌తిలో పార్టీ నేత‌ల‌తో స‌మావేశమ‌యితే… జ‌గ‌న్ మాత్రం హైద‌రాబాద్‌లో స‌మావేశ మ‌య్యార‌ని..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎవ‌రు కావాలో తేల్చేకోండంటూ ట్విట్ చేశారు. ఇంకే ముంది నెట‌జ‌న్లు లోకేష్‌పై ట్రోలింగ్ మొద‌లు పెట్టారు.

‘అయ్యా.. షార్ట్‌ కట్‌ మినిష్టరూ.. హైదరాబాద్‌ మరో ఐదేళ్లపాటు మన రాజధానేనన్న విషయం మర్చిపోయావా?.. మీ అయ్య ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి.. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. మరీ నీవెందుకు ఇంకా అమరావతిలో శాశ్వత ఇల్లు కట్టుకోలేదు.. ప్రతిపక్షనేతనన్నా.. ఇప్పటికే శాశ్వత ఇల్లు, పార్టీ కార్యాలయం కట్టారు.. మీరు అన్ని తాత్కాలికంతోనే కదా పబ్బం గడుపుతున్నారు?’ అని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు.

ఎన్నికల మేనిఫెస్టో కమిటీ భేటీ ఫొటోనూ.. తాజా మీటింగ్‌ది అంటావేంది?’ అని తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంపై ఐటీ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా ట్విటర్‌లో ఎన్ని రోజులు పబ్బం గడుపుతావో చెప్పు? దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు’ అనే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మ‌రి నారా లోకేష్ ఇప్ప‌టికైనా మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇస్తారా లేకా ఎన్నిక‌లు పూర్త‌య్యేంత వ‌ర‌కు ట్విట్ట‌ర్‌కే ప‌రిమ‌త మ‌వుతారో చూడాలి.

https://twitter.com/naralokesh/status/1104756031652020224

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -