ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు ఆ రాజకీయాల్లో ఒక సంచలనం నమోదు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంచలనం ఎక్కడో కాదు.. ప్రస్తుతం అధికార టీడీపీకి పట్టున్న అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి వైసీపీలోకి చేరబోతున్నాడా.. అంటే అవుననే అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎంపీ పదవికి జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
ఎంపీగా ఉండి ప్రజలకు ఏం చేయాలేకపోతున్న కాబట్టి.. రాజీనామా చేస్తున్నట్లు తెలిపింది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదని జేసీ తెలిపారు. అనంతపురం జిల్లా అభివృద్దికి కొందరు అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే బుధవారం రోజు రాజీనామా చేస్తానని టీడీపీకి పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక తాడిపత్రి నియోజికవర్గంలో అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో.. ముందస్తుగానే జేసీ వేసిన ఎత్తుగడగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయనని ఇప్పటికే ప్రకటించారు జేసీ. అయితే ఒఅవన్ రెడ్డి కోసమే జేసీ ఈ ప్లాన్ వేసి ఉంటారని అంటున్నారు. పవన్‌రెడ్డి ద్వారా టీడీపీలో జేసీ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలన్నది దివాకర్‌రెడ్డి అభిప్రాయంగా ప్రచారంలోవుంది. ఆ క్రమంలో భాగంగా జేసీ మూడు సీట్ల పై చంద్రబాబుకు ప్రపోజల్ చేయగా.. అందుకు చంద్రబాబు అసలు పట్టించుకోకపోవడంతో జేసీ రాజీనామా అస్థ్రాన్ని తెరపైకి తెచ్చారని చర్చించుకుంటున్నారు.
అయితే రీసెంట్ గా లండన్ వెళ్లిన జగన్ మోహన్ రెడ్డిని పవన్ రెడ్డీ కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జగన్ కు పవన్ రెడ్డి మంచి మిత్రుడని.. అయను త్వరలోనే వైసీపీలోకి చేరుతున్నాడని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక తన కొడుకు కోసమే ముందస్తు రాజీనామా చేయడం వల్ల ప్రజల్లో తనకు సింపతి పెరిగి వచ్చే ఎన్నికల్లో లాభం చేకూరుతుందని జేసీ ఇన్నర్ గా వేసిన ప్లాన్ అని అంటున్నారు. ఏది ఏమైనా.. జేసి రాజీనామా తో చంద్రబాబు బ్యాచ్‌కి పెద్ద షాక్ తగిలిందని అందరూ చర్చించుకుంటున్నారు.
