Wednesday, April 17, 2024
- Advertisement -

టీడీపీతో క‌ల‌సి ఉన్న‌ప్పుడు ప‌వ‌న్‌కు అనంత క‌రువు, ప్ర‌జా స‌మ‌స్య‌లు గుర్తుకు రాలేదా..?

- Advertisement -

ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై అధికార పార్టీ టీడీపీని ప్ర‌శ్నించాల్సిన ప‌వ‌న్ విచిత్రంగా జ‌గ‌న్‌ను టార్గెట్ చేసి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రించాల్సింది ప్ర‌భుత్వం. కాని వాటిని జ‌గ‌న్ ఎలా ప‌రిస్క‌రిస్తారు. అవ‌స‌రం అయితే పోరాటం చేస్తారు. స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ పోరాటం చేసినా వాటిని బాబు ప‌రిస్క‌రించ‌రు. ఎందుకంటే ఎక్క‌డ జ‌గ‌న్‌కు మంచి పేరు వ‌స్తుంద‌నో. అదీ కూడా తెలియ కుండా ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డం సిగ్గుచేటు.

గ‌తంలో ప‌వ‌న్ ఎన్ని స‌మ‌స్య‌ల‌మీద పోరాటం చేశారు…? వాటిలో ఎన్ని ప‌రిష్క రించారు బాబు అనేది ప‌వ‌న్ ఒక సారి ఆలోచిస్తే మంచిదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.ప్ర‌త్యేక‌హోదా, ఇసుక‌, భూ, ఇరిగేష‌న్ కుంభ‌కోణాలు ఇత‌ర ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ అనేక పోరాటు చేసిన విష‌యాన్ని ప‌వ‌న్ మ‌ర్చిపోయిన‌ట్టున్నారు. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌గ‌న్ మాట్లాడుతున్న‌ప్పుడు మైక్ క‌ట్ చేయ‌డం, టీడీపీనేత‌లు ఎదురుదాడి చేయ‌డంలాంటి సంఘ‌ట‌న‌లు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. అందుకే జ‌గ‌న్ నేరుగా పాయ‌దాత్ర పేరుతో జ‌నంలోకి వెళ్లారు.

ఇవ‌న్నీ ఆలోచించ‌కుండా ప‌వ‌న్ ఆవేశంతో ఊగిపోయి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తూ త‌న స్థాయిని త‌గ్గించుకుంటున్నారు. వైసీపీనుంచి 23 మంది ఎమ్మెల్యేల‌ను బాబు సంత‌లో ప‌శువుల్లా కొన్నారు. దాని గురించి మాట్లాడ‌ట‌మంటే ప‌వ‌న్‌కు భ‌యం. తాజాగా అనంత‌పురం క‌రువ‌పై జ‌గ‌న్ పోరాడాల‌ని మ‌రో సారి త‌న రాజ‌కీయ అజ్ణానాన్ని బ‌య‌ట పెట్టుకున్నారు. అసెంబ్లీకి వెళ్లి సమస్యలపై మాట్లాడాలని సలహా ఇచ్చారు.

2014 లో టీడీపీ హామీల‌కు నేనే పూచీ అన్న ప‌వ‌న్ ఇప్పుడు ఎమ‌య్యారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా టీడీపీతో అంట‌కాగిన‌ప్పుడు అనంత క‌రువు ప‌వ‌న్‌కు గుర్తుకు రాలేదా….? గుర్తుకు వ‌చ్చినా టీడీపీతో క‌ల‌సి ఉన్నాడు కాబ‌ట్టి దాని గురించి ఆలోచించ‌లేదేమో. ఇప్పుడే అనంత‌పురానికి క‌రువు వ‌చ్చిన‌ట్లు …దాన్ని వెంట‌నే ప‌రిస్క‌రించాల‌ని అందుకు అనుగునంగా ప్ర‌ణాలిక‌న‌లు సిద్ధం చేయాల‌ని సెల‌విచ్చారు. త‌ర త‌రాలుగా క‌రువు కోర‌ల్లో చిక్కుకున్న సంగ‌తి ప‌వ‌న్‌కు గుర్తుకు లేదా …?

వైసీపీ నాయకులు జనసేనను గుర్తించకున్నా ఫర్వాలేదని, సమస్యలను గుర్తిస్తే చాలని ఈ సందర్భంగా పవన్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉన్నది వైసీపీ గుర్తింపు కోసం కాదని, ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు అని గుర్తుచేశారు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా ప్ర‌జా స‌మ‌స్య‌లు గుర్తుకు రాలేదా ప‌వ‌న్‌కు….? ఇప్ప‌టి కైనా ప‌వ‌న్ ఆచితూచి విజ్ణ‌త‌గా మాట్లాడితే ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు మంచిది. ప‌వ‌న్ చెప్తుంటే..విన‌డానికి ఆయ‌న అభిమానులున్నారు క‌దా…:!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -