టీడీపీ , జనసేన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పవన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని చేసిన వ్యాఖ్యలకు పవన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాను ప్రజలను రెచ్చగొట్టేవాడిని కాదని, నిజాలు చెప్పేవాడినని అన్నారు. అలాగే, దోపిడీ చేస్తూ ప్రజలకు నష్టపర్చే విధానాలను అవలంబిస్తే తాను చేతులు కట్టుకుని కూర్చునేవాడిని కాదని అన్నారు.
టీడీపీ నేతలు ఇలానే దోపిడీ చూస్తూ పోతే నిజంగానే ప్రజలను రెచ్చగొడతానని , దోపిడీ ఎలా చేస్తారో చూస్తానని పవణ్ అన్నారు. తాను భాజాపా ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదవడానికి వ్యక్తిత్వం లేని వ్యక్తిని కాదని అన్నారు. అలాగే తాను మాటలు మార్చే వ్యక్తిని కాదని, ఎప్పుడూ ఒకే మాటపై ఉంటానని అన్నారు. తనకూ బీజేపీకి సంబంధమే లేదని స్పష్టం చేశారు.
టీడీపీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు ఇవ్వలేకపోతోందని, మరోవైపు సింగపూర్ తరహా అభివృద్ధి అని అంటోందని పవన్ కల్యాణ్ అన్నారు. సింగపూర్‌లో మతం, కులం, ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వరని, అక్కడ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారని, పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తారని అన్నారు. కానీ టీడీపీ నేతలు అలా కాదని, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
