Saturday, May 4, 2024
- Advertisement -

ముద్రగడ ఏమంటాడో ? మనోడే కదాని ఊరుకుంటాడా ?

- Advertisement -

బాబోయ్ పవన్ కళ్యాణ్ ఎంటి ? జగన్ మోహన్ రెడ్డిని మించిపోవడం ఏంటి ? అని ఆశ్చర్యపోకండి. ఎందులో మించిపోయాడు ? అని అడగండి. సమాధానం చెబుతాం. హామీలు ఇవ్వడంలో. ఎన్నికలు రాకముందే, జనసేన పార్టీ మ్యానిఫెస్టో తయారు కాకముందే కళ్లుబైర్లుకమ్మే హామీలు ఇచ్చేశారు పవన్ సార్. నవరత్నాలు పేరుతో ఓ వైపు జగన్ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లను పెంచుతామంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న 1000, 1500 రూపాయలు కాకుండా అంతకు రెట్టింపు చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారు. వాటితో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా నవరత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పుకొస్తున్నారు. అయితే దానిపై ఆ మధ్య కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశం. నేను అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు ఇస్తాను…అని చంద్రబాబులా చెప్పి మోసం చేయలేను. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం కనుక, కాపు రిజర్వేషన్లపై హామీ ఇవ్వలేను. కానీ కాపు కమిషన్ కు 10వేల కోట్ల నిధులు ఇస్తాను అని చెప్పారు. చంద్రబాబు 5 వేల కోట్లు ఇస్తానన్నారు. కానీ నేను దానికి రెట్టింపు ఇస్తాను అని జగన్ చెప్పుకొచ్చారు. దీనిపై ముద్రగడ పద్మనాభం అంతెత్తున లేచారు. కాపు రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేవు సరే. మరి ప్రత్యేకహోదా కూడా రాష్ట్ర పరిధిలో లేదు కదా. అధికారం ఇస్తే హోదా తెచ్చేస్తాను అని ఎలా చెబుతున్నావ్ జగన్… అంటూ ముద్రగడ ఫైరయిపోయారు. అసలు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మన దేశ బడ్జెట్ కాదు కదా అమెరికా దేశ బడ్జెట్ కూడా చాలదని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీన్ కట్ చేస్తే..
పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వికలాంగుల సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి సమస్యలు విన్నారు. తాను చిన్నప్పటి నుంచీ వికలాంగుల సమస్యలు చూసి చలించిపోతునన్నా అని చెప్పారు. 20 ఏళ్లకే వారి సమస్యలైప డాక్యుమెంటరీ కూడా తీశానని తెలిపారు. ఆ తర్వాత వికలాంగులే షాక్ అయ్యేలా వారికి ఓ హామీ ఇచ్చేశాడు. జనసేన అధికారంలోకి వస్తే ఒక్కో వికలాంగుడికి నెలకు 10 వేల రూపాయల చొప్పున పింఛన్ అందిస్తామని చెప్పాడు. అంతేనా…! వాటితో పాటు రిజర్వేషన్లు పెంపు, స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు, హాస్టళ్లు, ఉద్యోగాలు, సెల్ఫ ఎంప్లాయి్ మెంట్, ఆరోగ్య కార్డులు…అంటూ ఏకధాటిగా ఊగిపోతూ ఉపన్యాసమిచ్చినట్టు హామీలు కురింపించేశారు. తమకు ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ ను 5 వేలు చేయాలని వాళ్లు కోరారు. కానీ పవన్ సార్ ఏకంగా 5వేలు ఏం ఖర్మ 10 వేలు ఇస్తాను తీసుకోండి. పోయి నాకు ఓట్లు వేసే పనిలో ఉండండని అని భరోసా ఇచ్చేశారు. దీంతో దివ్యాంగులతో పాటు చుట్టూ ఉన్న ప్రజలంతా షాక్ తిన్నారు. ఏది అమలు చేయగలమో, ఏది చేయలేమో అంచనా వేసుకుని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి మ్యానిఫెస్టో తయారు చేస్తామని చెప్పుకొచ్చిన పవన్ సార్, ఇప్పుడు ఇలా భారీ హామీలు ఎందుకు ఎలా ఇచ్చేశాడో అర్ధం కావట్లేదు. మరి జగన్ హామీల అమలకు అమెరికా బడ్జెట్ కూడా చాలదని మండిపడిన ముద్రగడ పద్మనాభం, ఇప్పుడు పవన్ హామీలపై ఏమంటారో ? లేక మన కాపు నాయకుడే కదా ? ఇచ్చింది హామీయే కదా ? అని తేలిగ్గా తీసుకుంటాడో ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -