Saturday, May 4, 2024
- Advertisement -

రాహుల్ వ్యాఖ్య‌ల‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చి ప్ర‌ధాని మోదీ….

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ,ఎంఐఎం ల‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఒక్క భాజాపా మాత్ర‌మే త‌ప్ప మిగిలిన పార్టీల‌న్నీ కుటుంబ పార్టీలేన‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన టీడీపీని..ఇప్పుడు కాంగ్రెస్‌ ఒడికి చేర్చారని చంద్రబాబుపై మండిపడ్డారు మోదీ. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన భాజాపా బ‌హిరంగ స‌భ‌లో మోదీ పాల్గొన్నారు. దేశంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తాలని, కుటుంబ పార్టీలు ప్రజాస్వామానికి ప్రమాదకరమని, ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి వచ్చిన ఒకే ఒక్క పార్టీ బీజేపీ అని అన్నారు.

చంద్రబాబు, సోనియా గాంధీ..కేసీఆర్‌కు రాజకీయ గురువులని మోదీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గతంలో టీడీపీలో ఉన్నారని.. తెలంగాణ వచ్చిన తర్వాత సోనియాను కూడా కలిశారని గుర్తుచేశారు. యూపీఏ-1 హయాంలో కేసీఆర్ కేంద్రమంత్రిగా పనిచేసిన మాట వాస్తవం కాదా? అని మోదీ ప్రశ్నించారు. ఎవరు ఎవరికి మిత్రులో ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు.

ఒక్క ఓటుతో కుటుంబ, వంశ, వర్గ పార్టీలను ఖతం చేయాలని మోదీ పిలుపు నిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని, కర్ణాటకలో జేడీఎస్ ను బీజేపీ ‘బీ’ టీమ్ అని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల తర్వాత జేడీఎస్ తో కలిసిపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలని, కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలైన విషయాన్ని ప్రస్తావించారు.

ఎంఐఎం మతాంతర పార్టీ అవునా కాదా అంటూ ప్రశ్నించారు. ఈ వంశ, కుటుంబ, మతపరమైన పాలనకు తెలంగాణ ఎన్నికలతోనే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు అంటూ మోదీ వ్యాఖ్యానించారు. లౌకికవాదంలో ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అంటూ కొనియాడారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -