- Advertisement -

పోల‌వ‌రం చంద్ర‌బాబుకు ఏటీఎమ్ లాంటిది….

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. పోల‌వ‌రం ప్రాజెక్టు బాబుకు ఏటీఎమ్ లాంటిద‌ని ఎద్దే వ చేశారు. భాజాపా అధికారంలోకి వ‌చ్చి వెంట‌నే పోల‌వ‌రానికి జాతీయ హోదా క‌ల్పించి రూ.7000 కోట్లు నిధులు మంజూరు చేశామ‌న్నారు.ఆ ప్రాజెక్టును అవినీతిగా మార్చిన బాబు ఈ ప్రాజెక్టు నుండి డబ్బులను డ్రా చేస్తూ తమ ఖజానాలో వేసుకొంటున్నాడని ఆయన ఆరోపించారు.

సోమవారం నాడు రాజమండ్రిలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. ప్రాజెక్టు అంచ‌నాలు పెంచి నిధుల‌ను దండుకుంటున్నార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. పోలవరం ప్రాజెక్టు నాలుగు దశాబ్దాలుగా ప్రారంభానికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైందన్నారు. . ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశ్యం ప్రస్తుత ముఖ్యమంత్రి బాబుతో పాటు గత పాలకులకు కూడ లేదని ఆయన విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -