Thursday, May 9, 2024
- Advertisement -

రాహుల్ నీకు అంత సీన్ ఉందా…?

- Advertisement -

అన్యాయంగా రాష్ట్రాన్ని విడ‌గొట్టిన కాంగ్రెస్ పార్టీకి 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఘోరి క‌ట్టారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్ది ఉనికికోసం నానా సంక‌లు నాకుతోంది. విభ‌జ‌న బిల్లులో ప్ర‌త్యేక హోదా అంశాన్ని చేర్చ‌కుండా ఇప్పుడు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతోంది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు క‌ర్నూల్ ప‌ర్య‌ట‌న‌లో అధికారంలోకి వ‌స్తారే మొద‌టి సంత‌కం ప్ర‌త్యేక హోదా మీదే న‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. రాహుల్‌కు అంత సీనుందా ..?

ఆంధ్రలో అసలు అడుగు పెట్టడానికే భయపడింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నేతలు గప్ చుప్ గా వుండిపోయారు ఇన్నాళ్లు. కాని మోదీ పుణ్య‌మాని రాహుల్‌ ఆంధ్రాలో అడుగుపెట్టారు. ప్ర‌త్యేక హోదాపై ఎన్డీఏ ప్ర‌భుత్వం యూట‌ర్న్ తీసుకోవ‌డంతో ఇప్పుడు ఆ ప‌ని రాహుల్ త‌న భుజాన ఎత్తుకున్నారు.

రాహుల్ నిర్ణ‌యం వ‌ల్ల అవుతుందా. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేసి, ఒంటి చేత్తో గెలిచి, మెజారిటీ స్థానాలు తీసుకుని, ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీన్ ఈ దేశంలో ప్రస్తుతానికి అయితే లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో అంటకాగాలి. ఆయా పార్టీలు అన్నింటికీ ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకహోదా విషయంలో సమస్యలు వున్నాయి. మరి వీటిని పట్టించుకోకుండా రాహుల్ హోదా ఇచ్చేయగలరా? అంతెందుకు, ఆంధ్రకు హోదా ఇస్తున్నాం అని చెప్పి, ఇప్పుడు తెలంగాణలో జనం ముందుకు ఓట్ల కోసం కాంగ్రెస్ వెళ్లగలదా?

గెలిచిన తరువాత ప్రభుత్వం ఏర్పాటుకే వివిధ పార్టీలను బజ్జగించాలి, వరాలు ఇవ్వాలి. అలాంటి టైమ్ లో తొలిసంతకానికి ఆ పార్టీలు అడ్డంపడవన్న గ్యారంటీ ఇవ్వగలదా? ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాయి. వారంద‌రిని ఒప్పించి రాహుల్ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌గ‌ల‌డా అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. అస‌లు అధికారంలోకి వ‌స్తే కాదా…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -