Tuesday, May 14, 2024
- Advertisement -

జ‌గ‌న్ వెళ్ల‌టం వ‌ల్ల‌నె అమాత్రమైన మెజారిటి వ‌చ్చింది…..

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అధికార‌పార్టీకి ఘ‌న‌మైన విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు నంద్యాల ప్ర‌జ‌లు. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ టీడీపీ అభ్య‌ర్తి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఇచ్చారు. అయితే వైసీపీ ఓట‌మి వెనుక అస‌లైన నిజాలు తెలుసుకుందాం..

ప్ర‌ధానంగా శిల్పా బ్ర‌ద‌ర్స్ కుటుంబంమీద తీవ్ర వ్య‌తిరేక‌త ఎంత ఉంద‌నేది ఎన్నిక‌ల్లో బ‌య‌ట‌ప‌డింది. 2014 ఎన్నిక‌ల్లో శిల్పా ఓట‌మి త‌ర్వాత ఆయ‌న చేసిన దౌర్జాన్యాలును చూసి ప్ర‌జ‌లు విసుగెత్తిపోయారు. పేద‌ల ఇళ్ళ‌స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకున్నార‌నె ఆరోప‌న‌లు ప్ర‌చార స‌మ‌యంలో వ‌చ్చాయి. ముందునుంచి శిల్పా కుటుంబంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఉప ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా త‌మ క‌సిని తీర్చుకున్నారు ప్ర‌జ‌లు. వారిమీద అభిమానం ఉంటె క‌నీసం టీడీపీ అభ్య‌ర్తి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి కొంతైనా పోటీ ఇచ్చేవాడు.

ఉప ఎన్నిక అనివార్యం అయిన‌ప్ప‌టినుంచి టీడీపీ ముంద‌స్తు వ్యూహాలు అమ‌లు చేసింది. అభివృద్ధి పేరుతో నంద్యాల‌కు వంద‌ల కోట్లు ప‌నులు చేప‌ట్టింది. ఎన్నిక‌ల కోడ్ రాక‌ముందే అభివృద్ధిప‌నులును మొద‌లు పెట్టింది ప్ర‌భుత్వం. ఈ ప‌నులు పూర్తి కావాలంటె వేరె ప్ర‌త్యామ్నాయం లేదునుకొని అధికార పార్టీకి ఓట్లు వేశారు ప్ర‌జ‌లు . వైసీపీ గెలిచినా ఉప‌యేగం ఉండ‌ద‌నేది అక్క‌డి ప్ర‌జ‌లల్లో బ‌లంగా ఉంది.

కొంత వ‌ర‌కు వైసీపీకి అనుకూలంగానె ఉన్నా మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిపై జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు అధికార పార్టీకి పూర్తి అనుకూలంగా మారాయి. ఆదినారాయ‌ణ‌రెడ్డి నిక్క‌ర్ ఊడ‌దీస్తాన‌ని చేసిన వ్యాఖ్య ప్ర‌తిప‌క్షానికి పెద్ద దెబ్బ కొట్టింది. గోస్పాడు మండ‌లంలో వైసీపీకి మెజార్టి వ‌స్తుందని పెట్టుకున్న నాయ‌కుల‌ అంచ‌నాలు తారుమార‌య్యాయి. ఆదినారాయ‌ణ‌రెడ్డి గోస్పాడులో టీడీపీకి అనుకూలంగా చ‌క్రం తిప్పారు. దీనికి తోడు గంగుల ప్ర‌తాప్ రెడ్డి టీడీపీలో చేర‌డం కూడా అదికార పార్టీకి పూర్తిగా క‌ల‌సి వ‌చ్చింది. దీంతో టీడీపీకి విజ‌యం ఏక‌ప‌క్షం అయ్యింద‌నడంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -